ప్రకాశంజిల్లా చీరాలలో వైకాపా నేత మోదడుగు రమేష్‌బాబు.... పోలింగ్ కేంద్రం వద్ద వీరంగం సృష్టించారు. ఓటు వేసేందుకు లోపలకు వచ్చిన రమేష్ బాబు.... గుర్తింపు కార్డు అడిగిన ఏజెంట్‌పై దుర్భాషలాడుతూ విరుచుకుపడ్డారు. అక్కడకు చేరుకున్న తెలుగుదేశం ఏజెంట్లు ఇది మంచి పద్ధతి కాదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి సర్దిచెప్పి... రమేష్‌బాబును పంపేశారు.
ప్రకాశం జిల్లాలోనే... పిట్టువారిపాలెం అనే మరో ప్రాంతంలో.. తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఉద్రిక్తతలను అదుపుచేసేందకు వచ్చిన ఎస్‌ఐ చంద్రశేఖర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు ఇటుకరాయితో దాడి చేశారు.