రాష్ట్రంలో గడచిన నెలరోజులుగా నిలిచిపోయిన పాలనా పరమైన అంశాలపై సీఎస్ ఆద్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీ ఎన్నికలతో సంబంధంలేని అంశాల్లో ముందుకు వెళ్లాల్సిందిగా సూచనలు చేసింది. వచ్చే వ్యవసాయ సీజన్ కు రైతులకు జారీ చేయాల్సిన ఎరువులపై నిర్ణయం తీసుకుని వ్యవసాయ శాఖకు ఆమేరకు అనుమతులు ఇచ్చింది. వైద్యశాఖలో 292 అంబులెన్సుల కొనుగోలుకు సంబంధించి తదుపరి కార్యాచరణకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 238 మంది డిప్యూటీ తహసిల్దార్ ల నియామకానికి కూడా అనుమతులు జారీ చేశారు. రాష్ట్రంలో 813 మంది పోలీసు కానిస్టేబుళ్ల పదోన్నతులకు సంబందించి నిర్ణయం తీసుకున్నారు.
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సత్వరం పరిష్కరించండిరాష్ట్రంలోని గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పటికీ తాగునీరు,పశుగ్రాసం వంటి వాటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా సకాలంలో చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఇందుకు సంబంధించి నిధుల విడుదల సమస్యలుంటే ఆర్ధికశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని సూచించారు. జిల్లా స్థాయిలో జడ్పీ సీఈఓ,పంచాయితీ,గ్రామీణ నీటిసరఫరా,మున్సిపల్ కమీషనర్లు,ఇంజనీర్లు రోజువారీ పరిస్థితిని సమీక్షించి తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు.
ఇదీ చదవండి
ట్రాన్స్కో చీఫ్ విజిలెన్స్ అధికారిగా వెంకటరత్నం