ETV Bharat / briefs

సోహన వినయ్​ల కల్యాణం కడు రమణీయం

అద్భుతాల రామోజీ ఫిల్మ్​సిటీలో సంబరం అంబరాన్నంటింది. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఇంట కల్యాణం వైభవంగా జరిగింది. రామోజీరావు మనవరాలు.. సుమన్-విజయేశ్వరిల కుమార్తె కీర్తి సోహన.. రాయల రఘు-సుభాషిణిల కుమారుడు వినయ్‌ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన అతిరథ మహారథులు, ప్రముఖులు హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారు

author img

By

Published : Apr 20, 2019, 7:27 PM IST

Updated : Apr 20, 2019, 9:29 PM IST

సోహన వినయ్
సోహన వినయ్​ల కల్యాణం కడు రమణీయం

బంధు మిత్రుల ఆశీర్వచనాలు.. ఆత్మీయుల అక్షతల మధ్య రామోజీరావు మనవరాలు సోహన వివాహం చూడముచ్చటగా జరిగింది. అతిరథ మహారథులు, ఆత్మీయుల సాక్షిగా మంగళవాయిద్యాల వేదమంత్రోచ్ఛరణల నడుమ.. పచ్చని పెళ్లిపందిరిలో వినయ్-సోహన వివాహబంధంతో ఒక్కటయ్యారు.
ఆకాశమంత పందిరి...భూదేవతంత పీట అన్నట్లుగా రామోజీ ఫిల్మ్‌సిటీలో తీర్చిదిద్దిన సువిశాల ప్రాంగణంలో కల్యాణం కన్నుల పండుగగా సాగింది. తెలుగింటి సంప్రదాయం ఉట్టిపడేలా పెళ్లి వేడుకను నిర్వహించారు. చూపుతిప్పుకోనివ్వని పుష్పాలంకరణ, అతిథుల్ని ఆకట్టుకునే ఏర్పాట్లతో కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాజాబజంత్రీల మధ్య పెళ్లి పందిరిలోకి అడుగుపెట్టిన వరుడు వినయ్‌కి రామోజీ రావు-రమాదేవి దంపతులు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు.
ఆ తర్వాత సకుటుంబ పరివార సమేతంగా, బాజాబజంత్రీల నడుమ పెళ్లి కుమార్తె.. సోహన పల్లకిలో వేదిక వద్దకు చేరుకున్నారు. వేద పండితులు నిర్ణయించిన సుముహూర్తంలో జీలకర్ర, బెల్లం పెట్టించారు...
అనంతరం...బంధువులు, ఆత్మీయులు, అతిథులు అక్షతలు వేసి వధూవరులను ఆశీర్వదించారు
ఆ తర్వాత వరుడు వినయ్‌.. బంధుమిత్రుల సమక్షంలో పెళ్లికూతురు సోహన మెడలో మూడు మూళ్లు వేశారు. మాంగల్య ధారణ అనంతరం తలంబ్రాల తంతు కోలాహలంగా సాగింది...

తరలివచ్చిన అతిరథులు

రామోజీ ఇంట జరిగిన వివాహ వేడుకకు.. పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి,సెంట్రల్ విజిలెన్స్​ కమిషనర్ కె.వి. చౌదరి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, క్రికెటర్ కపిల్ దేవ్ , సినీప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి తదితరులు హాజరయ్యారు.

ఇదీ చదవండి

వినయ సోహనం చిత్రమాలిక

Intro:jk_ap_vja_12_20_dalva_raithula_kastalu

Body:కొనుగోలు కేంద్రాలు లేక రైతుల ఇక్కట్లు

Conclusion:సెంటర్ జగ్గయ్యపేట, లింగ స్వామి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుచుకోక రైతుల అవస్థలు ధాన్యం కొనేవారు లేక ఆందోళనలో అన్నదాతలు రబీలో సాగు చేసిన ధాన్యాన్ని అమ్ముకోలేక రైతులు ఇక్కట్లకు గురవుతున్నారు. అష్టకష్టాలు పడి ఇ పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే వారు లేక కళ్ళల్లో దీనంగా కాలం వెళ్లదీస్తున్నారు. కృష్ణాజిల్లాలో జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం ,తిరువూరు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. ఈ ప్రాంతాల్లో వేల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు ఇప్పటివరకు దాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుచుకోకపోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాము తప్ప మరెవరూ కొనేవారు లేరనే ఉద్దేశంతో ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు ఒకవైపు వాతావరణం భయపెడుతున్న నేపద్యంలో ఎప్పుడు అకాల వర్షాలు పడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అందుకే దళారులు అడిగిన ధరలకు విక్రయించాల్సి వస్తుంది ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ ఆ దరలకు ఎక్కడ ధాన్యం కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర 75 కిలోల బస్తా కు 1350 ఉండగా, దళారులు మాత్రం వెయ్యి రూపాయల నుంచి కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల రైతు బస్తా కు 300 వరకు నష్టపోతున్నారు . ఇదేమని రైతులు దళారులను ప్రశ్నిస్తే ..కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో రైతులు చేసేది లేక వారు అడిగిన ధరలకే ముట్టజెప్పుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం పట్ల రైతులు ఆగ్రహం తెలుపుతున్నారు ఇప్పటికైనా వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
Last Updated : Apr 20, 2019, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.