పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం ప్రత్తికోళ్లలంకలో ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తపరిస్థితులు తలెత్తాయి. ఓటింగ్ ముగిసిన అనంతరం రేగిన ఘర్షణ తీవ్ర పరిణామాలకు దారి తీసింది. తెదేపా, వైకాపా కార్యకర్తలు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి.