ప్రేమంటే ఇలా ఉంటుంది అని చెప్పలేం...దీన్నే ప్రేమంటారు... అని వివరించనూలేం. ప్రేమ గురించి చెప్పమంటే ప్రతి ఒక్కరు 'కాళిదాసులే'...అదే ప్రేమ భగ్నమై 'దేవదాసు'లైన వాళ్లూ ఉన్నారు.
ఫిబ్రవరి 14ని 'ప్రేమికుల రోజు'గా జరుపుకుంటారు. ఆ ఒక్క రోజే కాకుండా ఆ వారంలో ఒక్కో రోజును ఒక్కో రకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ ప్రేమికుల రోజులో ప్రతి రోజూ ప్రత్యేకమే...
- ఫిబ్రవరి 7-(రోజ్ డే)
ఈరోజును ప్రేమికులు తమకిష్టమైన వారికి గులాబీ పూలను బహమతిగా ఇచ్చి వారి మనసు గెలిచేందుకు ప్రయత్నిస్తారు. ఒకటిగా గానీ, బొకే రూపంలోగానీ గులాబీలను ఇస్తారు.
![రోజ్ డే](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/2445472_roseday.jpg)
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
- ఫిబ్రవరి 8-(ప్రపోజ్ డే)
ఈ రోజు ప్రేమికులు తాము ప్రేమించిన వారికి ప్రేమను వ్యక్తం చేస్తారు. అదే విధంగా వారి నుంచి ప్రపోజల్‌ను ఆశిస్తారు. భాషేదైనా భావం మాత్రం అదే.
![ప్రపోజ్ డే](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/2445472_prapose-day.jpg)
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
- ఫిబ్రవరి 9-చాక్లెట్ డే
చాక్లెట్లంటే అమ్మాయిలకు చెప్పలేనంత ఇష్టం. వారికిష్టమైన చాక్లెట్లను అబ్బాయిలు వివిధ రకాలుగా డిజైన్ చేసి బహుమతిగా ఇస్తారు. వారి అభిమానాన్ని సంపాదించడానికి ఇదో ప్రయత్నం.
![చాక్లెట్ డే](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/2445472_choclate.jpg)
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
- ఫిబ్రవరి 10-టెడ్డీ డే
చాక్లెట్లు కాకుండా అమ్మాయిలకు ఇష్టమైన వస్తువు టెడ్డీ బేర్. ప్రేమలో భాగంగా వివిధ రకాల ఆకృతుల్లోని టెడ్డీ బేర్లను అబ్బాయిలు అమ్మాయిలకు బహుమతులుగా ఇస్తారు.
![టెడ్డీ డే](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/2445472_teddy.jpg)
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
- ఫిబ్రవరి 11- ప్రామిస్ డే
నమ్మకం లేని ప్రేమ నిలబడటం కష్టం. భవిష్యత్తులో తామేం చేస్తారో తమ ప్రియుడికి లేదా ప్రియురాలికి ప్రతిజ్ఞ చేస్తారు. పెళ్లి గురించి కావొచ్చు. బహుమతుల గురించో, మరే ఇతర విషయాలైనా కావొచ్చు.
![ప్రామిస్ డే](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/2445472_promise.jpg)
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
- ఫిబ్రవరి 12-హగ్ డే
ఈరోజు ఇష్టమైన వారిని మనస్ఫూర్తిగా హత్తుకుని తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. వీలైతే మంచి మంచి బహుమతులిచ్చి వారిని ఇంప్రెస్ చేస్తారు.
![హగ్ డే](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/2445472_hugday.jpg)
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
- ఫిబ్రవరి 13-కిస్ డే
ప్రియమైన వారిని ముద్దు పెట్టుకుని తమలో దాగి ఉన్న, చెప్పలేని ప్రేమను వ్యక్త పరుస్తారు. వాటిని జీవితాంతం తీపిగుర్తులుగా జ్ఞాపకం ఉంచుకుంటారు. తర్వాత రోజు వాలంటైన్స్ డే కోసం ఏర్పాట్లు చేసుకుంటారు.
![కిస్ డే](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/2445472_kissday.jpg)
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
- ఫిబ్రవరి 14-వాలంటైన్స్ డే
ప్రేమికుల దినోత్సవం..ప్రేమికుల అపూరూపంగా జరుపుకునే పండగ. ఈ వారం రోజుల్ని సెలబ్రేట్ చేసుకున్నదాని కంటే ఈరోజును ఘనంగా జరుపుకుంటారు. తమకిష్టమైన వారితో ఈరోజును జరుపుకోవడం జీవితంలో అద్భుతమైనదిగా భావిస్తారు.
![వాలంటైన్స్ డే](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/2445472_valantine.jpg)
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)