ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభాపతిగా ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం పేరు దాదాపు ఖరారైంది. డిప్యూటీ స్పీకర్‌గా పీడిక రాజన్నదొరను జగన్ నియమించనున్నారని పార్టీలో జోరుగా చర్చనడుస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ కలిసిన తమ్మినేనికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. అయితే స్పీకర్ రేసులో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ రావు ఉన్నప్పటికీ సీఎం జగన్ తమ్మినేని వైపే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యేగా గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం తమ్మినేనికి ఉంది.
కళింగ సామాజికవర్గానికి చెందిన తమ్మినేని ఐదుసార్లు ఆముదాలవలస నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.. మూడుసార్లు తెదేపా నుంచి ఒకసారి స్వతంత్రంగా తాజాగా వైకాపా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 9ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమైన కళింగ సామాజిక వర్గానికి కీలక పదవి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయవర్గాల సమాచారం