ETV Bharat / briefs

మోదకొండమ్మ ఉత్సవాల్లో... విషాద ఘటనలు

మోదకొండమ్మ ఉత్సవాలు విషాదాన్ని మిగిల్చాయి. నాలుగు రోజులు జరిగిన ఉత్సవాల్లో విషాధ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ జరిగిన పలు ఘటనల్లో నలుగురు మృత్యువాత పడ్డారు.

author img

By

Published : May 16, 2019, 9:57 PM IST

పాడేరు మోదకొండమ్మ ఉత్సవాల్లో...విషాధ ఘటనలు

విశాఖ మన్యం పాడేరులో శ్రీ మోదకొండమ్మ ఉత్సవాలు ముగిశాయి. ఈ ఏడాది జరిగిన ఉత్సవాలు విషాదాన్ని మిగిల్చాయి. నాలుగు రోజులు జరిగిన ఈ ఉత్సవాల్లో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ జరిగిన వివిధ ఘటనల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. పాడేరు ప్రాంత వాసులు ఆనందంగా జరుపుకునే మోదకొండమ్మ ఉత్సవాలు...ఈ ఏడాది నాలుగు కుటుంబాల్లో కన్నీటి గాథలు మిగిల్చాయి.

మోదకొండమ్మ ఉత్సవాలు ప్రారంభమైన రోజునే విషాదం చోటు చేసుకుంది. పాడేరు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఆరు నెలల గర్భవతి మృతి చెందింది. అమ్మ వారి దర్శనానికి వస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.

ఉత్సవాల రెండో రోజు రాత్రి...జెయింట్ వీల్ బాక్స్ విరిగిన ఘటనలో ఓ బాలిక మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఇంటర్మీడియట్ చదువుతున్న భవాని.. జెయింట్ వీల్ ప్రమాదంలో మృతి చెందడం వలన ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది.

ఉత్సవాల మూడోరోజున మరో ప్రమాదం చోటు చేసుకుంది. అమ్మవారి దర్శనానికి స్కూటర్​పై వస్తున్న రామయ్య అనే వ్యక్తి... కలెక్టర్ బంగ్లా వద్ద రక్షణ గోడను ఢీకొని లోయలో పడి చనిపోయాడు. రామయ్య మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. కుటుంబ పెద్దను కోల్పోయి విషాదంలో మునిగిపోయారు.

ఉత్సవాల చివరి రోజున...పర్యాటక ప్రాంతం మత్స్య గుండంలో స్నానానికి దిగిన కిరణ్ అనే 25 ఏళ్ల యువకుడు ఉబిలో కూరుకుపోయి మరణించాడు. డిగ్రీ పూర్తి చేసి.. చేతికి అందివచ్చిన కొడుకు ఆకస్మిక మరణం తల్లిదండ్రులను కలిచివేసింది.

ఈ ఏడాది మోద కొండమ్మ ఉత్సవాలలో అపశ్రుతి చోటు చేసుకోవడంపై భక్తులు విచారం వ్యక్తం చేశారు. ఉత్సవాల నాలుగు రోజుల్లో నలుగురు చనిపోవడం భక్తుల్లో చర్చనీయాంశమైంది.

Intro:slug: AP_CDP_36_16_BRAHMOCHAVALU_AV_C6
contributor: arif, jm
జమ్మలమడుగు ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
( ) కడప జిల్లా జమ్మలమడుగు పట్టణం లో వెలసిన శ్రీ nadapuram వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి .గురువారం ఆలయం ఆవరణలో dhwjarohanam కార్యక్రమంతో అధికారికంగా బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు .అంతకు ముందు ఆలయ శుద్ధి చేసి ఈ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లును పూర్తి చేశారు. గురువారం టిటిడి అధికారుల సమక్షంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలను ప్రారంభించారు .ఈనెల 25 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇవాళ జరిగిన ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. మరో పది రోజుల పాటు పట్టణంలో సందడి నెలకొని ఉంది

Body:జమ్మలమడుగు లో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు

Conclusion:జమ్మల పట్టణంలో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.