ఎమ్మార్పీఎస్ దండోరా ఉద్యమం మొదలై జులై 7కు 25 సంవత్సారాలు అవుతుందని..సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తెలిపారు. 1994లో ఈ ఉద్యమం ప్రారంభమై నిర్విరామంగా సాగుతోందని తెలిపారు. ప్రకాశం జిల్లా ఈదుమూడిలో భారీ ఎత్తున 'మాదిగల ఆత్మగౌరవ జాతర' పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.
కార్యక్రమానికి ప్రజలను ఆహ్వానిస్తూ రాజమహేంద్రవరంలో పాదయాత్ర చేశారు. దేవిచౌక్ నుంచి గోకవరం బస్టాండ్ వరకు ర్యాలీగా తరలివచ్చి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. తెలుగు రాష్ట్రాల్లోని మాదిగ సామాజికవర్గమంతా హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. వర్గీకరణ ఏర్పాటు చేయడానికి భాజపా ప్రభుత్వం సహకరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
మందకృష్ణ మాదిగ ఇలా ఎందుకన్నారు..! ఇక్కడ చదవండి...మమ్మల్ని విస్మరించారు.. అందుకే ఓడారు!