కడప జిల్లా పోరుమామిళ్లలో కస్తూరిబా గాంధీ బాలికల ఉన్నత పాఠశాల ప్రహారీ గోడ కుప్పకూలింది. దీని నిర్మాణం పనుల్లో గుత్తేదారులు నాణ్యత ప్రమాణాలను పాటించని కారణంగా కొద్దిపాటి గాలికే గోడ మొత్తం పడిపోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన వంద మందికి పైగా పేద బాలికలు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు. ప్రహారీ లేని కారణంగా విద్యార్థినులకు పూర్తి భద్రత కొరవడింది. ఈ పాఠశాల పట్టణానికి దూరంగా ఉంది. ప్రహారీ గోడ పడిపోయిన స్థానంలో కనీసం కంచె కూడా వేయలేదు. దీంతో పశువులు లోపలికి వచ్చి విద్యార్థినిల చదువులకు భంగం కలిగిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు విచారణ చేపట్టి ప్రహారీ గోడ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించని గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని బాలికల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీని స్థానంలో యుద్ధ ప్రాతిపదికపైన ప్రహారీ గోడ నిర్మించాలని వారు కోరుతున్నారు.
నాణ్యత కరవైంది... కొద్దిపాటి గాలికే గోడ కూలింది - kadapa district
కడప జిల్లా పోరుమామిళ్లలో కస్తూరిబా గాంధీ బాలికల ఉన్నత పాఠశాల ప్రహారీ గోడ కొద్దిపాటి గాలికే కూలిపోయింది. నాణ్యత ప్రమాణాలను పాటించని వాళ్లపై చర్యలు తీసుకోవాలని బాలికల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రహారీ గోడ పునర్నిర్మించాలని కోరుతున్నారు.
కడప జిల్లా పోరుమామిళ్లలో కస్తూరిబా గాంధీ బాలికల ఉన్నత పాఠశాల ప్రహారీ గోడ కుప్పకూలింది. దీని నిర్మాణం పనుల్లో గుత్తేదారులు నాణ్యత ప్రమాణాలను పాటించని కారణంగా కొద్దిపాటి గాలికే గోడ మొత్తం పడిపోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన వంద మందికి పైగా పేద బాలికలు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు. ప్రహారీ లేని కారణంగా విద్యార్థినులకు పూర్తి భద్రత కొరవడింది. ఈ పాఠశాల పట్టణానికి దూరంగా ఉంది. ప్రహారీ గోడ పడిపోయిన స్థానంలో కనీసం కంచె కూడా వేయలేదు. దీంతో పశువులు లోపలికి వచ్చి విద్యార్థినిల చదువులకు భంగం కలిగిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు విచారణ చేపట్టి ప్రహారీ గోడ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించని గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని బాలికల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీని స్థానంలో యుద్ధ ప్రాతిపదికపైన ప్రహారీ గోడ నిర్మించాలని వారు కోరుతున్నారు.
ఫైల్: ap_vsp_77_04_manyamlo_vesavilo_pogamanchu_av_c11
యాంకర్: విశాఖ మన్యం వేసవి వేకువలో పొగమంచు దట్టంగా వ్యాపించి చలికాలం ను తలపించింది. పాడేరు ఏజెన్సీలో రెండురోజులుగా సాయంత్రం వర్షం పడటంతో పగటి వేసవి వేడిగాలులకు వర్షం తడి వాతావరణం తోడై పొగమంచు పరిచేసింది. ఉదయం 20 డిగ్రీలు కనీసం నమోదైంది. వేసవిలో రాత్రులు ప్యాన్ ఉండాలి కానీ రెండురోజులుగా దుప్పటి ముసుగు వేసుకుని నిద్రిస్తున్నారు.
పగటి వేసవి, సాయంత్రం వర్షం తోడై వేకువ మంచు ముసుగేస్తుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
శివ, పాడేరు
Body:శివ
Conclusion:పాడేరు