తెదేపాకు కొణతాల బహిరంగ మద్దతు - TDP
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ... తెలుగు దేశం పార్టీకి బహిరంగ మద్దతు ప్రకటించారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే రాష్ట్రమంతటా పర్యటించి వారి గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు.
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీకి బహిరంగ మద్దతు ప్రకటించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించే సత్తా తెదేపాకే ఉందని అన్నారు. రాష్ట్రంలో తెదేపా విజయానికి కృషి చేస్తానని, ఆ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేస్తానని వెల్లడించారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే రాష్ట్రమంతటా పర్యటించి వారి గెలుపునకు కృషి చేస్తానన్నారు.
ఉత్తరాంధ్ర చర్చా వేదక ఏర్పాటు చేసి.. ఆ ప్రాంత అభివృద్ధి, హామీల సాధనకు కొణతాల ఇన్నాళ్లూ శ్రమించారు. ఈ మధ్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని.. తెదేపాలో చేరతారని అంతా అనుకున్నారు. తర్వాత వైకాపా గూటికి వెళ్తారన్న ప్రచారమూ జరిగింది. చివరికి ఆయన ఏ పార్టీలోకి వెళ్లకున్నా... బహిరంగ మద్దతును మాత్రం తెదేపాకే ప్రకటించడం.. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది.
కర్నూల్ అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం వైకాపా అభ్యర్థులు నామినేషన్ వేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భరత్ తన తండ్రి టీజీ వెంకటేష్ తో పాటు కేఈ ప్రభాకర్ తో కలిసి నామినేషన్ వేశారు. వైకాపా అభ్యర్థి హఫీస్ ఖాన్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఎస్వీ మోహన్రెడ్డి పార్టీ మారేటప్పుడు తెలుగుదేశం పార్టీని విమర్శించడం సరికాదన్నారు.
బైట్: టీజీ. వెంకటేష్. రాజ్యసభ సభ్యులు
టీజీ. భరత్. టీడీపీ అభ్యర్థి
Body:ap_knl_13_22_tdp_ycp_nominetions_avbb_c1
Conclusion:ap_knl_13_22_tdp_ycp_nominetions_avbb_c1