ETV Bharat / briefs

యువతి అపహరణకు యువకుడి యత్నం.. కాపాడిన స్థానికులు

పశ్చిమగోదావరి జిల్లా విస్సాకోడేరులో యువతి కిడ్నాప్ యత్నం స్థానికంగా సంచలనం సృష్టించింది. కారులో వచ్చిన యువకుడు యువతిని అపహరించడానికి ప్రయత్నించాడు. స్థానికుల ఆ కారును వెంబడించి.. యువతిని కాపాడారు.

యువతి కిడ్నాప్​కు యత్నించిన యువకుడు
author img

By

Published : Apr 30, 2019, 7:29 PM IST

యువతి కిడ్నాప్​కు యత్నించిన యువకుడు

పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరులో ఓ దుండగుడు యువతిని కిడ్నాప్ చేయడానికి విఫలయత్నం చేశాడు. విస్సాకోడేరులో నివాసముంటున్న యువతి.. తన తల్లితో కలిసి స్థానికంగా ఉన్న ఓ ఇంటర్నెట్ సెంటర్​కు వెళ్లింది. కొంతకాలంగా యువతి వెంటపడుతున్న షేక్ నయీమ్ తుల్లా అలియాస్ కాలిష్ అనే యువకుడు.. ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేయడానికి యత్నించాడు. యువతి తల్లి కేకలతో స్పందించిన స్థానికులు కారును వెంబడించారు. భీమవరం మండలం తాడేరు సమీపంలో అడ్డగించారు. నయీమ్​ను పట్టుకుని యువతిని రక్షించారు. నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో నయీమ్​కు సహకరించిన మరో యువకుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు పాలకోడేరు పోలీసులు విచారణ చేపట్టారు.

Intro:Ap_Vsp_38_30_fire victms_RDO_Av_C2
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్: మానవత్వం వెల్లివిరిసింది. అగ్ని కీలకలకు నిరాశ్రులయైన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పలు సంస్థలు, దాతలుముదుకొచ్చారు. అన్ని విధాల ఆదుకున్నారు. విశాఖ జిల్లా చోడవరంలోని ద్వారకానగర్ అగ్ని బాధితులకు అందరూ చేయూతను అందించారు.
వాయీస్ వోవర్: ద్వారకానగర్ లో 24ఇల్లు పూర్తిగా ఆరు ఇల్లు పాక్షికంగా కాలిపోయాయి. వీరికి ప్రభుత్వం తరపున 20 కిలోల బియ్యం, వంట పాత్రలు, వస్రాలు కొనుగోలు కు నగదును అనకాపల్లి ఆర్డీవో సూర్యకళ అందజేశారు.
30మంది బాధితులు సమ్మతి తెలిపితే స్థలమిచ్చి ఇంటి నిర్మాణం నకు నిధులు వచ్చేలా చేస్తమన్నారు.
బైట్: సూర్యకళ, అనకాపల్లి ఆర్డీవో.

Body:చోడవరం

Conclusion:8008574732

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.