అనంతపురం జిల్లా కదిరి మండలంలోని ఎర్రదొడ్డి గంగమ్మ తల్లి జాతరకు భక్తులు పోటెత్తారు. శ్రీరామనవమి తరువాత వచ్చే తొలి మంగళ, ఆదివారాల్లో గంగమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.
ఎర్రదొడ్డి గంగమ్మ తల్లిని అనంతపురంతో పాటు కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన భక్తులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కోరిన కోర్కెలను తీర్చే దైవంగా పేరున్న గంగమ్మను... భక్తులు అమిత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అమ్మవారికి బోనాలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడం వలన గంగమ్మ గుడి పరిసరాలు సందడిగా మారాయి.
ఇవీ చూడండి : సలోని... డాడీ హోమ్ టు అమెరికా!