ETV Bharat / briefs

భారీగా వర్షాలు.. ఉపశమనం పొందిన జనాలు - భారీగా వర్షాలు

రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. కొన్నాళ్లుగా ఉదయం ఎండ.. సాయంత్రం వర్షాలు కురుస్తున్నట్టుగానే.. చాలా జిల్లాల్లో జల్లులు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో కుండపోత కురిసింది. మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆర్టీజీఎస్ తెలిపింది.

ap-rains
author img

By

Published : Jun 6, 2019, 10:16 PM IST

మరో 3 రోజులు.. వర్షాలే వర్షాలు

రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ మేరకు ఆర్టీజీఎస్‌.. ఇప్పటికే సూచనలు జారీ చేసింది. ఈనెల 9 వ‌ర‌కు ప‌లు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వ‌ర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. ఈ నెల 11, 12 తేదీల్లో... రాయ‌ల‌సీమ జిల్లాల‌ను నైరుతి రుతుప‌వ‌నాలు తాకే అవకాశం ఉందని.. 13, 14 తేదీల్లో ద‌క్షిణ కోస్తా ప్రాంతాల‌కూ విస్తారిస్తాయని అంచనా వేసింది.

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం ఎస్. అమరవరంలో పిడుగుపడింది. పశువుల కాపరి గేదెలు మేపుతుండగా పిడుగు పడిన పరిస్థితుల్లో... కాపరితో పాటు ఓ గేదె మృతి చెందింది. ఉంగుటూరు మండలం పెద్దవుటపల్లిలో పిడుగుపాటుకు యువకుడు మృతి చెందాడు. నాగవరప్పాడులో ఇళ్ల మధ్యలో కొబ్బరిచెట్టుపై పిడుగుపడింది. గుంటూరుజిల్లా మాచర్లలో మబ్బులు కమ్ముకున్నాయి. నరసరావుపేటతో విద్యుత్‌ సరఫరా నిలిచి.. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అమృతలూరు, పెదకూరపాడు మండలంలో కురిసిన వర్షాలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వినుకొండ - కారంపూడి రహదారిలో వర్షానికి రాకపోకలు నిలిచాయి. ప్రకాశం జిల్లా చీరాలలో సాయంత్రం వర్షం కురిసింది...వేటపాలెం,చిన్నగంజాం ప్రాంతాల్లో వాతావరణం చల్లపడటంతో చల్లని గాలులను ప్రజలు ఆస్వాదిస్తున్నారు.

ఉభయగోదావరి జిల్లాల్లోనూ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది తప్పలేదు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుతో పాటు.. పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇరగవరం మండలం తూర్పువిప్పర్రులో ప్రధాన రహదారి పక్కన భారీవృక్షాలు విరిగిపడ్డాయి. కండవల్లి, ముక్కాముల, తీపర్రులో అరటి తోటలకు నష్టం వాటిల్లింది. ఎన్ వీ పాలెంలో కొబ్బరిచెట్టు కూలింది. ఈ ఘటనలో ఓ ఇల్లు దెబ్బతింది. లంకమాలపల్లి, అజ్జరం గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. తూర్పుగోదావరిజిల్లా రావులపాలెంలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. గాలులకు కొబ్బరిచెట్లు నేలకూలాయి. లంకప్రాంతాల్లో అరటి తోటలకు నష్టం వాటిల్లింది. కొత్తపేటలో ఈదురుగాలులకు ఫ్లెక్సీలు చిరిగిపోయాయి.

అనంతపురం జిల్లా రాయదుర్గంలో వానలకు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కనేకల్ మండలంలో అత్యధికంగా 31.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఈదురు గాలులతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరిన్ని జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఉదయం ఎండ కాస్తూనే.. సాయంత్రానికి ఉన్నపాటుగా వర్షం కురిసింది.

Intro:ap_knl_12_06_green_canal_av_c1
కర్నూల్ నగరంలోని కే. సీ. కాలువ ను గుర్రపు టెక్క మొక్కలు కప్పేశాయి.... నగరంలోని కే. వి.ఆర్. కళాశాల వద్ద నున్న కే. సీ. కాలువ పచ్చటి మొక్కలతో కనువిందు చేస్తోంది.... చూడడానికి బాగున్నా..... కేసీ కాలువలో ప్రస్తుతానికి మురుగు నీరు ప్రవహిస్తోంది.గుర్రపు టెక్క మొక్కలు కాలువను కప్పి వేయ్యడంతో కింద మురుగునీరు నిలువ ఉండడం తో దోమల అధికంగా ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. ఎవరైనా పొరపాటున కాలువలోకి దిగితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని అధికారులు స్పందించి కే సీ కాలువను శుభ్రం చెయ్యాలని స్థానికులు కోరుతున్నారు. విజువల్స్.

Body:ap_knl_12_06_green_canal_av_c1

Conclusion:ap_knl_12_06_green_canal_av_c1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.