ETV Bharat / briefs

'రాజకీయ ప్రత్యామ్నాయం కోసమే కూటమి' - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

రాజకీయ ప్రత్యామ్నాయం కోసమే వామపక్ష, జనసేన, బహుజన సమాజ్ పార్టీలు కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కేంద్రం, రాష్ట్రంలోని అధికారంలోకి వచ్చిన పార్టీలు ఎంతమేరకు తమ వాగ్దానాలు నిలబెట్టుకున్నాయో ఓటర్లు ఆలోచించాలన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
author img

By

Published : Apr 4, 2019, 9:04 AM IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
రాజకీయ ప్రత్యామ్నాయం కోసమే వామపక్ష, జనసేన, బహుజన సమాజ్ పార్టీలు కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయనిసీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కేంద్రం, రాష్ట్రంలోని అధికారంలోకి వచ్చిన పార్టీలు ఎంతమేరకు తమ వాగ్దానాలను నిలబెట్టుకున్నాయో ఓటర్లు ఆలోచించాలని విజయవాడ ప్రెస్ క్లబ్​లో జరిగిన సమావేశంలో సూచించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఏ అంశాలైతే ఉండాలని ఎన్డీయే ప్రభుత్వం నాడు డిమాండ్ చేసిందో... నేడు వాటిని అమలు చేయడంలో భాజపా పూర్తిగా విఫలమైందన్నారు. తమ కూటమి అధికారంలోకి వచ్చాక విద్య , వైద్యం పూర్తిగా ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి :ప్రత్యేక ఉపాధ్యాయుల ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు

యాంకర్ వాయిస్ =కడప జిల్లా వేంపల్లి మండలం టి వెలమ వారి పల్లి లో విషాదం నెలకొంది టిడిపి నాయకుల ప్రచారంలో వైసీపీ కార్యకర్త కందుల వెంకటరామిరెడ్డి ఇ 45 సంవత్సరాలు టపాసుల శబ్దానికి మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు మన దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి టిడిపి నాయకులు పులివెందుల టిడిపి అభ్యర్థి ఎస్సీ సతీష్ కుమార్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ప్రచారంలో లో తప్ప సులు భారీగా ఏర్పాటు చేయడంతో వైసీపీ కార్యకర్త మృతి చెందారు వెంకటరామిరెడ్డి ఇ టపాసుల శబ్దానికి మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వేంపల్లె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ... బై టు =శంకర్ రెడ్డి

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.