ETV Bharat / briefs

ఇంజినీరింగ్ ప్రాజెక్టులపై అధ్యయన కమిటీ - expert

సాగునీటి, సీఆర్డీఏ, రోడ్లు భవనాల శాఖలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రభుత్వం 8 మంది సభ్యులతో నిపుణుల కమిటీని నియమించింది. జలవనరులశాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేసే ఈ కమిటీ 45 రోజుల్లో నివేదికను  అందజేయాలని ఆదేశాలు జారీఅయ్యాయి.

సాగునీటి, సీఆర్డీఏ ప్రాజెక్టులపై అధ్యయన కమిటీ
author img

By

Published : Jun 15, 2019, 6:16 AM IST

సాగునీటి, సీఆర్డీఏ ప్రాజెక్టులపై అధ్యయన కమిటీ
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, సీఆర్డీఏ, రోడ్లు భవనాలశాఖలో ప్రస్తుతం జరుగుతోన్న ప్రాజెక్టులపై నిపుణుల కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 8 మంది విశ్రాంత ఇంజినీరింగ్ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తూ జలవనరుల శాఖ ఆదేశాలు ఇచ్చింది. పనుల్లో పారదర్శకత, అవినీతి నిర్మూలన, అంచనాలు పెంపు, టెండరింగ్ ప్రక్రియ వంటి అంశాలను ఈ సాంకేతిక కమిటీ అధ్యయనం చేయనుంది. 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన ప్రాజెక్టులపై సమీక్ష చేసి ప్రభుత్వానికి నివేదించనుంది.

జలవనరుల శాఖ నోడల్ ఏజెన్సీగా ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జలవనరులశాఖ చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్​ని కన్వీనర్​ నియమిస్తూ...8 మంది సభ్యుల సాంకేతిక కమిటీని ఏర్పాటుచేశారు. టెండర్ల పూర్తయిన పనులు ప్రారంభం కాని ప్రాజెక్టులు, 25 శాతం కంటే తక్కువ పూర్తయిన ప్రాజెక్టులపై ఈ కమిటీ సమీక్ష చేయనుంది.

అవసరమైతే రీటెండరింగ్​కు వెళ్లే అంశాలను సూచించాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశించింది. ఈ కమిటీ తమ నివేదికను 45 రోజుల్లోగా అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. కమిటీ కార్యనిర్వహణకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఇదీ చదవండి : నేడు దిల్లీలో వైకాపా పార్లమెంటరీ పార్టీ భేటీ

Intro:సామాజిక స్పృహతో చేసే గొప్ప దానం రక్తదానం

Body:సామాజిక సేవ చేసే గొప్ప దానం రక్తదానం అని ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సందడి భాష, రక్త నిధి కేంద్రం చైర్మన్ షారుఖ్ ఆలీ పేర్కొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో రక్తదానం పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రక్తదానం ప్రాణంతో సమానం అన్నారు. రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉండే వాడిని తెలియకుండానే కాపాడినవారవుతారు. సృష్టిలో రక్తదానం చేసే గొప్ప అవకాశం ఒక్క మానవుడికి మాత్రమే ఉందన్నారు. రక్తదానం చేయడం వల్ల గుండెజబ్బుల బారిన పడకుండా ఉండవచ్చన్నారు. రక్త దానం పట్ల ప్రజలు అపోహలను విడనాడి రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో వైద్యశాల డాక్టర్లు నజిబుల్లా, అనీష్ సల్మా పాల్గొన్నారు.

Conclusion:రక్తదానం పై అవగాహన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.