ETV Bharat / briefs

వేగం కంటే కచ్చితత్వానికే ప్రాధాన్యం: ద్వివేది - వీడియో

"ఎన్నికల ఫలితాలను వేగంగా ఇవ్వడంకంటే కచ్చితత్వంతో ఇవ్వడానికే ప్రాధాన్యతనిస్తాం. ఓట్ల లెక్కింపులో కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలను పాటించాలి. ఓట్ల లెక్కింపులో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పరిణతితో వ్యవహరిస్తాం. కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశాం."  -- గోపాలకృష్ణ ద్వివేది, ఎన్నికల ప్రధానాధికారి

వేగం కంటే కచ్చితత్వానికే మా ప్రాధాన్యం: ద్వివేది
author img

By

Published : May 22, 2019, 9:17 AM IST

ఓట్ల లెక్కింపులో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు వినోద్ జుటీషీతో కలిసి 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫలితాలను వేగంగా ఇవ్వటం కంటే కచ్చితత్వంతో ఇవ్వటానికే ప్రాధాన్యత ఇస్తామని తేల్చి చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

ఈసీఐ మార్గదర్శకాలు కచ్చితంగా అమలుచేయాలి

ఈవీఎంల లెక్కింపు సమయంలో మాక్​పోల్ ఓట్లకు సంబంధించి ఫారం 17సీ విషయంలో ఇప్పటికే జారీ చేసిన ఉత్తర్వులు కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. మార్గదర్శకాలకు అనుగుణంగా ఏజెంట్లను అనుమతించాలనీ.. 2019 ఫిబ్రవరిలో ఈసీఐ మరింత సంక్షిప్తంగా సూచనలు చేసిందని తెలియచేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలలో క్రమశిక్షణ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపు కోసం 500 ఓట్లకు ఒక కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు చేయాలని సూచించారు.

పరిణతితో వ్యవహరించండి

ఎన్నికల ఫలితాలు ప్రకటన సమయంలో సమన్వయంతో వ్యవహరించాలని ఈసీఐ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల ప్రత్యేక పరిశీలికలు వినోద్ జుటీషి స్పష్టం చేశారు. ఫలితాలు వెలువడిన తర్వాత తలెత్తే ఘటనలు సున్నితత్వంతో కూడుకున్నందున సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు తన అభిప్రాయం వ్యక్తం చేసిందనీ.. ఓట్ల లెక్కింపులో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పరిణతితో వ్యహరించాలని సూచించారు. సరైన గుర్తింపు కార్డులు కలిగి ఉన్నవారిని మాత్రమే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించేలా పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. సున్నితమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. ఫలితాలు వెల్లడించే సందర్భంలో తక్కువ ఓట్ల తేడాతో గెలుపోటములు ఉన్నట్లయితే తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలని స్పష్టం చేశారు.

వేగం కంటే కచ్చితత్వానికే మా ప్రాధాన్యం: ద్వివేది

ఇవీ చదవండి..

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: డీజీపీ

Intro:ap_vzm_36_22_odisa_vasi_mruthi_avb_c9 ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లా డు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఆసుపత్రి పాలయ్యాడు స్వగ్రామం వెళ్తుండగా మార్గ మధ్యలో తీవ్ర అస్వస్థతకు గురై ఒడిస్సా వాసి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది

Body:ఒడిశాలోని కడ vanji గ్రామానికి చెందిన మను బెంజ్ హైదరాబాదులోని ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు ఈ నెల 12న విద్యుత్ ఘాతానికి ఆయన గురై తీవ్రంగా గాయపడ్డాడు అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందక సోమవారం డిశ్చార్జి చేశారు అంబులెన్స్లో స్వగ్రామానికి ఆయన తరలిస్తుండగా వాహనం పార్వతీపురం వచ్చేసరికి బాధితుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు కుటుంబీకులు పరిస్థితి గమనించి పార్వతిపురం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు వైద్యులు చికిత్స అందిస్తుండగా ఆయన మృతి చెందారు మృతుని కుటుంబీకులు తీవ్ర విషా దానికి గురయ్యారు

Conclusion:ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మను బెంజ్ మృతి చెందిన యువకుడు విషాదంలో కుటుంబీకులు మాట్లాడుతున్న వైద్యులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.