దళితులపై జరుగుతున్న దాడుల విషయంలో రాజకీయ పార్టీలు తమ వైఖరిని చెప్పాలని విశాఖ దళితసేన నాయకులు డిమాండ్ చేశారు. దళిత ఓటు బ్యాంకు కోసం మాట్లాడే నేతలు..దాడులపై స్పందించకపోవడం విచారకరమన్నారు. విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దళిత సేన రాష్ట్రాధ్యక్షుడు పాల్తేటి పెంటారావ్ మాట్లాడుతూ...దేశంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరి తెలిపి...దళితులకు అండగా ఉండాలని కోరారు.
ఇవీ చూడండి : కేంద్రంలో లౌకిక ప్రభుత్వం: బీవీ రాఘవులు