ETV Bharat / briefs

మోదీ మాటలు కోటలు దాటతాయి..: చంద్రబాబు

ఇచ్ఛాపురం నియోజకవర్గం...రాష్ట్రానికి సరైన వాస్తుగా సీఎం చంద్రబాబునాయుడు అభివర్ణించారు. నాగావళి, వంశధార, బాహుదా నదుల అనుసంధానంతో శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్న బాబు...పనుల కోసం ఇతరప్రాంతాల వాళ్లు జిల్లాకు వలస వచ్చేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

author img

By

Published : Mar 30, 2019, 5:44 PM IST

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎన్నికల ప్రచార సభకు హాజరైన సీఎం చంద్రబాబు.. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు తెదేపా గెలుపు గాలి వీస్తుందన్నారు. 55 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా ఇస్తున్నామన్న సీఎం..పింఛను మొత్తం 3 వేల రూపాయలకు పెంచుతామని వెల్లడించారు. మహేంద్రతనయ పూర్తి చేశామని చెప్పిన బాబు.. జిల్లాలోని మిగిలిన ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామన్నారు.

ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే జగన్ కు, సినిమా నటులకు రాష్ట్రంపై అవగాహన లేదని విమర్శించిన సీఎం..మోదీ మాటలు కోటలు దాటతాయి.. చేతలు గడప కూడా దాటవని ఎద్దేవా చేశారు.

కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్ చేయిస్తూ...3,500 రూపాయలు పింఛను ఇస్తున్నామని తెలిపారు చంద్రబాబు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించి కిడ్నీ రోగులను ఆదుకుంటామని పేర్కొన్నారు. చంద్రన్న బీమాను 5 లక్షల నుంచి10 లక్షల రూపాయలు చేస్తామని హామీ ఇచ్చిన బాబు..తిత్లీ తుపాను వస్తే కేంద్రం సాయం చేయలేదని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్న తెదేపానే మళ్లీగెలిపించాలని కోరారు.

ఇవీ చూడండి

మోదీ.. రాష్ట్రానికి చేసిందేంటో చెప్పండి. లేదంటే..!

Intro:AP_RJY_59_30_VADAPALLU_VENKANNA_AV_C9
తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ :ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది

Body:7 శని వారం నోము నోచుకునే భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణాన్ని గోవింద నామస్మరణతో మారుమోగాయి స్వామివారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అన్నీ క్యూలైన్లు నిండిపోయాయి స్వామి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుంది

Conclusion:వచ్చిన భక్తులకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.