Indias Richest Cricketer Ajay Jadeja : భారత క్రికెటర్‌లలో అత్యంత ధనవంతుడిగా కోహ్లీకి పేరుంది. సుదీర్ఘకాలం నుంచి క్రికెట్‌లో టాప్ బ్యాటర్‌గా కొనసాగుతున్న విరాట్ భారీగా సంపాదిస్తున్నాడు. శాలరీ, మ్యాచ్ ఫీజులు, ఐపీఎల్, టాప్ బ్రాండ్‌ల ఎండార్స్‌మెంట్‌లతో అతడికి భారీగా ఆదయం అందుతోంది. ఈ స్థాయిలో సంపాదిస్తున్న కోహ్లీని మాజీ క్రికెటర్ ఒక్క రోజులో అధిగమించాడు. దేశంలో అత్యంత ధనవంతుడైన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఎవరతను? ఒక్క రోజులో ఎలా సాధ్యమైంది? అని ఆలోచిస్తున్నారా?
ఒక్క రోజులో సంపన్నుడిగా మారింది భారత మాజీ బ్యాటర్ అజయ్ జడేజా (53). దసరా సందర్భంగా జామ్ నగర్ రాజ కుటుంబం అతడిని వారసుడిగా ఎంచుకుంది. నవానగర్(జామ్ నగర్ పాత పేరు) సంస్థానానికి కాబోయే మహారాజు(జామ్‌సాహెబ్)గా జడేజా పేరును ప్రకటించింది. ప్రస్తుత జామ్ సాహెబ్ శత్రుసల్యసింహ్జీ దిగ్విజయ్ సింహ్‌జీ ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు. దీంతో అజయ్ జడేజా నవానగర్ మహారాజుగా సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నారు.
- ఒక్క రోజులో అత్యంత ధనవంతుడిగా గుర్తింపు
జామ్‌నగర్ సింహాసనానికి వారసుడిగా మారడంతో భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజాకి భారీగా సంపద లభించింది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఒక్క రాత్రిలో అధిగమించాడు.
కొన్ని నివేదికల మేరకు ప్రస్తుతం విరాట్ కోహ్లీ నెట్‌వర్త్(Kohli NetWorth) రూ.1,000 కోట్లు. నవానగర్(జామ్ నగర్ పాత పేరు) సంస్థానానికి కాబోయే మహారాజు(జామ్‌సాహెబ్)గా జడేజా నెట్‌వర్త్ ఇప్పుడు రూ.1,450 కోట్లు కానుంది. సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత, అజయ్ జడేజా అత్యంత ధనిక క్రికెటర్‌గా మారనున్నాడు.
- రాజకుటుంబంతో అజయ్ జడేజాకు ఉన్న అనుబంధం ఏంటి?
ఒకప్పటి ప్రిన్స్‌లీ స్టేట్ నవానగర్‌నే ప్రస్తుతం జామ్ నగర్‌గా పిలుస్తున్నారు. దేశంలో రాచరిక వ్యవస్థ అంతమైనప్పటికీ గుజరాత్‌లోని ఈ ప్రాంతంలో రాజకుటుంబ పాలన ఇంకా కొనసాగుతూనే ఉంది. జామ్‌నగర్ రాజ కుటుంబానికి చెందిన వాడే అజయ్ జడేజా కూడా. అతడు మహారాజా శశత్రుసల్యసింహ్జీ జడేజా మేనల్లుడు. దసరా పండుగ సందర్భంగా పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో మాజీ క్రికెటర్‌ను తన చట్టపరమైన వారసుడిగా అధికారికంగా ప్రకటించారు. అజయ్ తండ్రి దౌలత్‌సింగ్‌జీ, మహారాజుకు కజిన్ అవుతారు. - అజయ్ జడేజా క్రికెట్ కెరీర్
అజయ్ జడేజా తన కెరీర్‌లో 1992 నుంచి 2000 వరకు టీమ్ ఇండియాకు ప్రాతినిథ్యం వహించాడు. 15 టెస్ట్ మ్యాచులు, 196 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ కెరీర్‌లో వన్డేల్లో 6 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలతో 6,000కు పైగా పరుగులు చేశాడు.
నవానగర్ మహారాజుగా భారత మాజీ క్రికెటర్
కివీస్‌తో టెస్ట్ సిరీస్ - అరుదైన రికార్డ్‌కు చేరువలో విరాట్ కోహ్లీ