ఎలక్షన్ మిషన్ 2019పై తెదేపా శ్రేణులతో సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు ఎంత ముఖ్యమో... సేవామిత్ర అంతే ముఖ్యమని చెప్పారు. ప్రతి బూత్ లో ఓటర్లను వ్యక్తిగతంగా కలవాలని.... తెలుగుదేశం పార్టీకి అందరి మద్దతు కూడగట్టాలని సూచించారు.
ఈవీఎం లు,వీవీ ప్యాట్ రశీదులపై అవగాహన పెంచాలని చెప్పారు. గత 5ఏళ్లలో పేదల సంక్షేమం సంతృప్తి స్థాయికి చేర్చామన్నారు. పారదర్శకంగా ప్రతి పైసా లబ్దిదారుడి ఖాతాలో వేస్తున్నామన్నారు. పేదరికం నిర్మూలనకు 10 సూత్రాలు ప్రకటించామని తెలిపారు. 10వేల కోట్లతో బీసీ బ్యాంకు ఏర్పాటు,...నెలకు 3వేలు పింఛన్, 150 యూనిట్ల ఉచిత విద్యుత్...గ్రామాలు, పట్టణాలలో హౌసింగ్ రుణాల రద్దు వీటన్నింటిపై విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.