ఆంధ్రప్రదేశ్లో విభజన తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థ తన రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ సాధారణ సమ్మతిని పునరుద్ధరించటంతో కార్యకలాపాలను వేగిరపర్చాలని భావిస్తోంది. రాష్ట్ర విభజన జరిగినా ఇప్పటి వరకూ హైదరాబాద్లోని జోనల్ కార్యాలయమే ఏపీ బాధ్యతలు చూస్తోంది. అయితే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సీబీఐ కార్యకలాపాలకు సాధారణ సమ్మతి ఉపసంహరించారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు వచ్చిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతితోనే సీబీఐ దాడులు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం సాధారణ సమ్మతి తిరిగి అనుమతించటంతో యథావిధిగా కేంద్ర దర్యాప్తు సంస్థ కార్యకలాపాలు రాష్ట్రంలో ఆరంభమయ్యాయి. విజయవాడ ఆటోనగర్‌లో ఉన్న సీజీఓ కాంప్లెక్సులోనే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సీబీఐ సమాయత్తం అవుతోంది. రాజధానిలో రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేయటం ద్వారా భౌగోళికపరమైన పరిధుల విషయంలో స్పష్టత రావటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని సీబీఐ భావిస్తోంది.
ఇదీ చదవండీ :