ETV Bharat / briefs

'శాసనసభ తొలి సమావేశాలకు వేళాయే' - ఏపీ అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ శాసనసభ తొలి సమావేశాలు ఇవాళ్టి నుంచి మొదలవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన నేతలు..నేటి సభలో శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేటి నుంచి ఈ నెల 18 వరకు జరిగే సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం, గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రభుత్వ అధినేత హోదాలో సీఎం జగన్ తొలిసారి అసెంబ్లీలో నేడు అడుగుపెట్టనున్నారు.

'15వ శాసనసభ తొలి సమావేశాలకు వేళాయే'
author img

By

Published : Jun 12, 2019, 6:14 AM IST

ఆంధ్రప్రదేశ్ రెండో శాసనసభ తొలి స‌మావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఉద‌యం 11 గంట‌ల 5 నిమిషాల‌కు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన 174 మంది శాస‌న స‌భ్యులను ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు ప్రమాణ‌ స్వీకారం చేయించనున్నారు. అనంతరం స్పీక‌ర్​గా త‌మ్మినేని సీతారామ్ అధికారిక ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. ఈ నెల 14న ఉభ‌య స‌భ‌ల‌నుద్దేశించి గ‌వ‌ర్నర్ ప్రసంగించ‌నున్నారు. నేటి నుంచి 18వ తేదీ వ‌ర‌కు అసెంబ్లీ స‌మావేశాలు జరగనున్నాయి.

జి. శ్రీ‌కాంత్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తొలిసారి ప్రభుత్వ అధినేత హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. నేడు..సభలో శాసనసభ్యుల ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ వెంకట చిన అప్పల నాయుడు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సీఎం జ‌గ‌న్ ప్రమాణం చేసిన అనంత‌రం ప్రతిప‌క్షనేత చంద్రబాబు, అనంత‌రం మంత్రులు, త‌రువాత శాస‌న స‌భ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుంది. స‌భ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయిన త‌రువాత అసెంబ్లీ స్పీక‌ర్ ఎన్నిక ఉంటుంది. ఇప్పటికే త‌మ్మినేని సీతారాం పేరును స్పీకర్ హోదాకు సీఎం జ‌గ‌న్ ఖరారు చేసినందున...స్పీకర్ ఎన్నిక లాంచ‌నంగానే జరుగుతుంది.

ఈ నెల 14న ఉభ‌య స‌భలనుద్దేశించి గ‌వ‌ర్నర్ నరసింహన్ ప్రసంగించ‌నున్నారు. గ‌వ‌ర్నర్ ప్రసంగం అనంత‌రం స‌భా వాయిదా ప‌డ‌నుంది. ఈ నెల 15,16 తేదీల్లో అసెంబ్లీ స‌మావేశాల‌కు సెల‌వు ప్రకటించారు. మళ్ళీ17, 18 వ తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. శుక్రవారం జరిగే శాస‌నస‌భా వ్యవ‌హారాల క‌మిటీ(బీఏసీ) భేటీలో గవర్నర్​కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఎన్ని రోజులు జరగాలో నిర్ణయిస్తారు.

ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం రోజున తలెత్తిన ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని రూట్ మ్యాప్ రూపొందించారు. అసెంబ్లీని చేరుకునేందుకు మూడు మార్గాలను సిద్ధం చేశారు.

ఇవీ చూడండి : వైకాపా దాడులను ప్రజల్లో ఎండగట్టాలి: చంద్రబాబు

byte= అంజాద్బాష డిప్యూటీ సీఎం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.