రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదిని వైకాపా నేత బొత్స సత్యనారాయణ కలిశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈవీఎం వీవీప్యాట్ ఓట్ల తేడాపై ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని 5 కేంద్రాల్లో వీవీప్యాట్, ఈవీఎం ఓట్లలో వ్యత్యాసం వచ్చిందన్న బొత్స...ఆ స్థానాల్లో రీపోలింగ్ జరపాలని ఈసీని కోరారు. కౌంటింగ్‌కు నాలుగు రోజుల ముందు ఆర్వోని మార్చటంపై అభ్యంతరం తెలిపారు.
ఉద్దేశపూర్వకంగానే అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని బొత్స ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ఈసీకి వినతి పత్రం అందించారు. ఓటింగ్ రోజు ఈవీఎంల సమస్యతో మరో ఈవీఎం పెట్టామన్న అధికారులు వీవీప్యాట్ స్లిప్పులు సరిపోల్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అధికారులు తెదేపా అభ్యర్థితో కుమ్మక్కై ఈవీఎం మాయం చేశారన్నారు.