కల్యాణదుర్గం నియోజకవర్గంలో 86 శాతంపైగా పోలింగ్ నమోదు కావడం హర్షించదగిన విషయమని ఉమామహేశ్వరనాయుడు అన్నారు. పార్టీ సీనియర్ నేతలతో భేటీ ఆయన...సిట్టింగ్ ఎమ్మెల్యే, వారి కుమారులు పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఆయన ఆరోపించారు. ప్రత్యక్షంగా వైకాపాకు సహకరిస్తూ ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై పార్టీ అధిష్ఠానానికి నివేదిక సమర్పిస్తామన్నారు. పార్టీకి నష్టం చేసేవారిపై అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా ఘనవిజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : రేపు దిల్లీలో భాజపాయేతర పక్షాల సమావేశం