ETV Bharat / briefs

ఎన్నికల్లో 68 కేసులు నమోదు.. ఒకరు మృతి: ఎస్పీ

రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని అనంతపురం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ సారి కేంద్ర బలగాలు తక్కువగా వచ్చినప్పటికీ పోలింగ్ సజావుగా సాగేలా చూశామని ఎస్పీ తెలిపారు. పోలింగ్ రోజున తాడిపత్రి మండలం వీరాపురంలో చోటు చేసుకున్న ఘటనలో ఒకరి మృతి మినహా... ఇంక ఎక్కడా తీవ్రస్థాయి ఘటనలు జరగలేదన్నారు.

అనంతపురం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
author img

By

Published : Apr 17, 2019, 8:25 PM IST

అనంతపురం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన రోజు నుంచి పోలింగ్ ముగిసే వరకూ జిల్లావ్యాప్తంగా 68 కేసులు నమోదు అయ్యాయని అనంతపురం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ కేసులకు సంబంధించి సుమారు 400 మందిని అరెస్టు చేశామని అశోక్ వెల్లడించారు. పోలీసు బలగాలు తక్కువగా ఉన్నప్పటికీ ప్రణాళిక బద్ధంగా పని చేశామన్నారు. ఎన్నికల అనంతరం పలు గ్రామాల్లో చెదురుమదురు సంఘటనలు జరిగాయని..ఆ ప్రదేశాల్లో అదనపు బలగాలు మోహరించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని ఎస్పీ వివరించారు. స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాటు చేశామన్న అశోక్ కుమార్... కౌంటింగ్ పూర్తయ్యే వరకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.

ఇవీ చూడండి : కడప జిల్లాలో... కాయ్ రాజా కాయ్!

Intro:SLUG:- AP_SKLM_100_17_TDP_PRESSMEET_SANDEEP

యాంకర్:- తిత్లీ తుఫాను ధాటికి పలాస నియోజకవర్గం ప్రజలు మునుపెన్నడూ లేని విధంగా భీతిల్లి పోయి సర్వం కోల్పోయిన రోజు అక్టోబర్ 11 2018 అని టిడిపి జిల్లా అధ్యక్షురాలు, గ్లో సంస్థ అధ్యక్షురాలు శిరీష తెలిపారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శిరీష మాట్లాడుతూ తుఫాను సమయంలో సీఎం చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం, స్థానిక క నేతలు చూపిన చొరవ, ధైర్యం కోల్పోయిన ప్రజలందరికీ భరోసా ఇచ్చిందన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి 21 రోజుల్లోనే 520 కోట్ల రూపాయల బాధితులకు అందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఉందని అన్నారు. గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ(గ్లో) వారి సారథ్యంలో లో వివిధ రంగాలకు చెందిన మేధావులు శాస్త్రవేత్తలు సామాజిక వేత్తలు తో తో ఈనెల 18వ తేదీన కాశి బుగ్గ లోని ఎస్ఎంసి ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటల నుంచి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి 20ఏళ్లు వెనక్కి నెట్టబడిన ఉద్దానం తీర ప్రాంత ప్రజానీకానికి ఆదుకునేందుకు కృషి చేయాల్సిన అంశాలపై చర్చిస్తామన్నారు.

బైట్:- గౌతు శిరీష, టిడిపి జిల్లా అధ్యక్షురాలు, గ్లో సంస్థ జిల్లా అధ్యక్షురాలు

Body:1

Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.