ETV Bharat / business

మార్కెట్లకు స్వల్ప నష్టాలు.. సెన్సెక్స్​ 49పాయింట్లు డౌన్

Stock Market Live Updates
Stock Market Live Updates
author img

By

Published : Jun 3, 2022, 9:34 AM IST

Updated : Jun 3, 2022, 3:40 PM IST

15:36 June 03

సెన్సెక్స్​ 49 పాయింట్లు, నిఫ్టీ 44 పాయింట్లు మైనస్​

స్టాక్​ మార్కెట్లు గురువారం సెషన్​ను నష్టాలతో ముగించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. అంతర్జాతీయ ప్రతికూలతలు, యూరోపియన్​ మార్కెట్ల ప్రభావంతో చివరికి స్వల్ప నష్టాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్​ 49 పాయింట్లు కోల్పోయి.. 55,769 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ 44 పాయింట్లు తగ్గి.. 16,584 పాయింట్ల వద్ద ముగిసింది.

09:26 June 03

వరుసగా రెండో సెషన్​లో స్టాక్​ మార్కెట్ల జోరు.. సెన్సెక్స్​ 400 ప్లస్​

Stock Market Live Updates: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు వరుసగా రెండో సెషన్​లో లాభాల్లో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 540 పాయింట్లకుపైగా పెరిగి.. 56 వేల 350 ఎగువవ ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో 16 వేల 760 ఎగువన కొనసాగుతోంది. హెవీవెయిట్​ రిలయన్స్ ఇండస్ట్రీస్​ సహా​ ఐటీ షేర్లు రాణిస్తుండటం మార్కెట్ల లాభాలకు ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. విప్రో, హెచ్​సీఎల్​ టెక్​, ఇన్ఫోసిస్​, టెక్​ మహీంద్రా, రిలయన్స్​ జోరుమీదున్నాయి. శ్రీసిమెంట్స్​, అపోలో హాస్పిటల్స్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, బ్రిటానియా ఇండస్ట్రీస్​, గ్రేసిమ్​ నష్టపోయాయి. గత సెషన్​లో సెన్సెక్స్​ 437, నిఫ్టీ 105 పాయింట్ల మేర లాభపడ్డాయి.

Last Updated : Jun 3, 2022, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.