ETV Bharat / bharat

వైఎస్సార్సీపీలో ముగిసిన మార్పులు చేర్పుల పర్వం- సిట్టింగులకు జగన్ మొండిచేయి - parliament constituencies

YSRCP Assembly and Parliament Constituencies Incharges Changing: అధికార వైఎస్సార్సీపీలో మరికొందరు ఎమ్మెల్యేల టికెట్లు చిరిగాయి. రెండు దఫాల్లో 14 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపిన ముఖ్యమంత్రి జగన్‌ తాజాగా మరో పది మంది ఎమ్మెల్యేలను పక్కనపెట్టారు. మొత్తంగా 24 మంది ఎమ్మెల్యేలకు, ముగ్గురు ఎంపీలకు టికెట్ లేదని తేల్చి చెప్పారు. మూడో జాబితాలో పలువురికి ఉద్వాసన పలకగా, మరికొందరు ఆశ్చర్యకరమైన రీతిలో టికెట్ దక్కించుకున్నారు.

YSRCP_Assembly_and_Parliament_Constituencies_Incharges_Changing

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2024, 6:52 AM IST

Updated : Jan 12, 2024, 8:16 AM IST

వైఎస్సార్సీపీలో ముగిసిన మార్పులు చేర్పుల పర్వం- సిట్టింగులకు జగన్ మొండిచేయి

YSRCP Assembly and Parliament Constituencies Incharges Changing: పశ్నించే గొంతును కోస్తారని వైఎస్సార్సీపీ సమన్వయకర్తల మూడో జాబితా ప్రకటనతో అధికార వైఎస్సార్సీపీ అధిష్ఠానం మరోసారి రుజువు చేసింది. 'దళితులుగా పుట్టడం మేం చేసిన నేరమా? పాపమా? నేనేం తప్పు చేశాను? వ్యతిరేకత దళితులమైన మా సీట్లలోనే ఉందా? డబ్బులు ఇస్తే ఐప్యాక్‌ వాళ్లు ఎవరి తలరాతలైనా మారుస్తారా? అంటూ ప్రశ్నించిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబును పక్కన పెట్టేశారు. ఆ నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిగా డాక్టర్‌ మూతిరేవుల సునీల్‌కుమార్‌ను నియమించారు.

సునీల్‌ 2014-19 మధ్య ఇదే పూతలపట్టు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎంఎస్‌ బాబుకు అన్యాయం చేసినట్లే 2019లో సునీల్‌ను పక్కను పెట్టారు. ఆయన అవమానభారంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో అప్పట్లో సంచలనమైంది. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆయన్నే ఇన్‌ఛార్జిగా ఎంపిక చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ టెక్కలి నియోజవర్గంలో అరాచకాలు చేస్తున్నారని ఆయన భార్యే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయటంతో శ్రీనివాస్‌ను తప్పించి ఆయన భార్య వాణిని సమన్వయకర్తగా నియమించారు.

పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితా

కొన్ని నెలలు గడవకుండానే తిరిగి దువ్వాడ శ్రీనివాస్‌నే టెక్కలి సమన్వయకర్తగా నియమించారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిని మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్‌ పిలిచి మాట్లాడారు. ఈసారి కూడా మీరే కొనసాగుతారని చెప్పి పంపారు. తాజాగా ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డిని సమన్వయకర్తగా ప్రకటించారు. మల్లికార్జున రెడ్డి 2019 ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రభుత్వ విప్‌గా ఉన్నారు. ఆ పదవిని, అధికారాన్ని వదులుకుని అప్పట్లో వైఎస్సార్సీపీలో చేరారు.

అధికారంలోకొస్తే మంత్రి పదవిస్తామని వైఎస్సార్సీపీ పెద్దలు ఆయనకు హామీనిచ్చారు. ఏ పదవీ ఇవ్వకపోగా ఇప్పుడు టికెట్టే గల్లంతు చేశారు. మూడో జాబితాలో ఓ మంత్రి తమ్ముడు అసెంబ్లీ, మరో మంత్రి కొడుకును లోక్‌సభకు పంపారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ సోదరుడు డాక్టర్‌ ఆదిమూలపు సతీష్‌ను తాజాగా కర్నూలు జిల్లా కోడుమూడు(ఎస్సీ) నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. అక్కడ సిటింగ్‌ ఎమ్మెల్యే సుధాకర్‌ను పక్కన పెట్టేశారు.

సురేష్‌ బావ డాక్టర్‌ తిప్పేస్వామి ప్రస్తుతం మడకశిర ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ను ఈసారి మార్చకపోతే సురేష్‌ కుటుంబంలో మూడు టికెట్లు ఇచ్చినట్లవుతుంది. తణుకు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌కుమార్‌ యాదవ్‌ను ఏలూరు లోక్‌సభ బాధ్యుడిగా నియమించారు. విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని బుధవారం సాయంత్రం జగన్‌ను కలిశారు. గురువారం రాత్రికి ఆయన్ను విజయవాడ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించేశారు.

కాపు ఓట్లు జారిపోకుండా వైఎస్సార్సీపీ వ్యూహం - వంగవీటి రాధ, ముద్రగడకు పార్టీలోకి ఆహ్వానం

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జెడ్పీ ఛైర్‌పర్సన్‌ పిరియ విజయకు ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ బాధ్యత అప్పగించారు. ఉమ్మడి కృష్ణా జెడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాళ్ల హారిక భర్త ఉప్పాళ్ల రామును పెడన అసెంబ్లీ నియోకజవర్గ బాధ్యుడిగా నియమించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురంలో ప్రస్తుత సమన్వయకర్తగా ఉన్న పిరియ సాయిరాజ్‌ను తప్పించి ఆ సీటును ఆయన భార్య పిరియ విజయకు అప్పగించారు.

తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడు అసెంబ్లీకి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తిరుపతి లోక్‌సభకు మార్చారు. మంత్రి గుమ్మనూరు జయరాంకు ఎక్కడా సీటు ఉండదనే ప్రచారం విస్తృతంగా జరిగింది. మూడు రోజులపాటు పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి చుట్టూ తిరిగిన ఆయన ఎట్టకేలకు కర్నూలు లోక్‌సభ సీటును దక్కించుకోగలిగారు. ఇన్​ఛార్జ్​లను మార్చుతూ ఇప్పటివరకు 3 జాబితాలను విడుదల చేసిన వైఎస్సార్సీపీ మొత్తం 51 అసెంబ్లీ ఇన్​ఛార్జ్​లు, 8 పార్లమెంట్ ఇన్​ఛార్జ్​లను మార్చింది. మొత్తంగా ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్‌ లేదని తేల్చేశారు. మూడు జాబితాల్లో కలిపి 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు లేవని జగన్ మొండి చేయి చూపారు.

వైఎస్సార్సీపీలో చిచ్చురేపుతున్న నియోజకవర్గాల బాధ్యుల మార్పు

Last Updated : Jan 12, 2024, 8:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.