ETV Bharat / bharat

Sharmila is Witness in Viveka Case: వివేకా హత్య కేసు.. సాక్షిగా వైఎస్‌ షర్మిల.. వాంగ్మూలం సమర్పించిన సీబీఐ - హైకోర్టు

Sharmila is Witness in Viveka Case
Sharmila is Witness in Viveka Case
author img

By

Published : Jul 21, 2023, 1:54 PM IST

Updated : Jul 21, 2023, 3:25 PM IST

13:51 July 21

గతేడాది అక్టోబర్‌ 7న దిల్లీలో సీబీఐకి వాంగ్మూల మిచ్చిన షర్మిల

ys viveka murder case: మాజీ మంత్రి వైఎస్​ వివేకానందరెడ్డి హత్యకు కడప ఎంపీ వైఎస్​ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి కుట్ర చేశారని సీబీఐ స్పష్టం చేసింది. హత్య కుట్ర, హత్య జరిగిన తర్వాత సాక్ష్యాల చెరిపివేత సహా పలు వివరాలను ఛార్జిషీట్‌లో ప్రస్తావించింది. వైఎస్ వివేకా హత్య కేసులో షర్మిలను 259వ సాక్షిగా పేర్కొంది. వివేకా హత్య కేసులో సీఎం జగన్ సోదరి షర్మిల గతేడాది అక్టోబర్‌ 7న దిల్లీలో సీబీఐకి వాంగ్మూలం ఇచ్చింది. సీబీఐ.. షర్మిలను 259వ సాక్షిగా పేర్కొంటూ సీబీఐ కోర్టుకు వాంగ్మూలం అందజేసింది. కాగా, తన వద్ద ఆధారాల్లేవుకానీ రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందని షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించింది.

హత్య వెనుక పెద్ద కారణమే ఉంది... హత్యకు కుటుంబ, ఆర్థిక కారణాలు కాదన్న షర్మిల అంతకు మించి పెద్దకారణమే ఉందని తెలిపింది. అవినాష్ కుటుంబానికి వ్యతిరేకంగా వివేకా నిలడటమే ఆయన హత్యకు కారణమై ఉండొచ్చని తెలిపింది. రాజకీయంగా వారి దారికి అడ్డొస్తున్నారని మనసులో పెట్టుకొని ఉండవచ్చని వెల్లడించింది. హత్యకు కొన్ని నెలల ముందు వివేకా బెంగళూరులోని తన ఇంటికొచ్చారని, కడప ఎంపీగా పోటీచేయాలని తనను అడిగారని షర్మిల వెల్లడించింది. ఎంపీగా అవినాష్ పోటీచేయవద్దని కోరుకుంటున్నట్లు వివేకా తనతో చెప్పారన్న షర్మిల.. ఇద్దరం కలిసి అవినాష్‌కు ఎంపీ టికెట్ ఇవ్వొద్దని జగన్ ఒప్పిద్దామన్నారని వాంగ్మూలం ఇచ్చారు. జగన్‌కు వ్యతిరేకంగా నేను వెళ్లనని వివేకా ఆలోచించారని, కానీ, జగన్‌ను కచ్చితంగా ఒప్పించగలననే ధీమాతో మాట్లాడారని షర్మిల సీబీఐకి తెలిపింది.

బాబాయి ఒత్తిడి చేయడంతో... జగన్ నాకు మద్దతివ్వరని తెలుసు కాబట్టి ఎంపీగా పోటీకి మొదట ఒప్పుకోలేదన్న షర్మిల.. బాబాయి పదేపదే ఒత్తిడి చేయడంతో సరే అన్నానని చెప్పారు. అయితే, ఎంపీగా వివేకానే పోటీ చేయాలనుకోకుండా మీపై ఎందుకు ఒత్తిడి తెచ్చారని సీబీఐ ప్రశ్నించగా.. బహుషా ఎమ్మెల్సీగా ఓడిపోయినందున ఎంపీగా పోటీకి ఆసక్తి చూపకపోవచ్చని చెప్పారు. విజయమ్మపై వివేకా పోటీ చేశాక కొంత దూరం పెరిగిందని, ఆ కారణంగా ఎలాంటి టికెట్ దక్కకపోవచ్చునని వివేకా భావించారని షర్మిల తెలిపింది. ఎమ్మెల్సీగా వివేకా ఓటమికి సన్నిహితులే కారణమన్న షర్మిల.. తనకు తెలిసినంత వరకు అవినాష్‌, భాస్కర్‌రెడ్డి, కొందరు సన్నిహితులే అందుకు కారణం అని వెల్లడించారు. కుటుంబంలో అంతా బాగున్నట్లు కనిపించినా.. లోలోపల కోల్డ్ వార్ ఉండేదని స్పష్టం చేశారు.

Last Updated : Jul 21, 2023, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.