ETV Bharat / bharat

చంద్రబాబును కలిసిన వైఎస్ షర్మిల - కుమారుడి పెళ్లికి ఆహ్వానం

YS Sharmila Invites Chandrababu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబును వైఎస్​ షర్మిల కలిశారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రిక అందజేసి ఆహ్వానించారు. ఆమె కుమారుడు వైఎస్​ రాజా రెడ్డికి, అట్లూరి ప్రియతో ఈ నెల 18వ తేదీన నిశ్చితార్థం, ఫిబ్రవరి 17వ తేదీన వివాహం జరగనుంది. ఈ సందర్భంగా షర్మిల పలువురు రాజకీయ ప్రముఖులను కలిసి వివాహ వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.

YS Sharmila Meets Chandrababu Naidu
YS Sharmila Invites Chandrababu Naidu
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 12:29 PM IST

Updated : Jan 13, 2024, 4:57 PM IST

YS Sharmila Invites Chandrababu Naidu : టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబును జగన్ సోదరి వైఎస్ షర్మిల (YS Sharmila) కలిశారు. హైదరాబాద్​లోని ఆయన నివాసానికి వెళ్లి తన కుమారుడు రాజారెడ్డి వివాహ (Sharmila Son Marriage) పత్రిక ఇచ్చి చంద్రబాబును ఆహ్వానించారు. ఆనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును (Chandra Babu Naidu) కలవడం సత్సంబంధాలను మెరుగుపరచుకోవడం కోసమేనని, రాజకీయ కోణంలో చూడొద్దని వైఎస్ షర్మిల కోరారు. తమ పెళ్లిళ్లకు కూడా చంద్రబాబు వచ్చి దీవించారని, తన కుమారుడి పెళ్లికి కూడా కుటుంబ సమేతంగా వచ్చి జంటను దీవించాలని కోరినట్లు తెలిపారు.

"ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. నా కుమారుడి పెళ్లికి చంద్రబాబును పిలిచేందుకు మాత్రమే వచ్చాను. మా వివాహాలకు కూడా చంద్రబాబును వైఎస్‌ఆర్‌ పిలిచారు. క్రిస్మస్‌ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్‌కు స్వీట్లు పంపాను. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. రాజకీయం అనేది మా జీవితం కాదు, అది మా వృత్తి." - షర్మిల, కాంగ్రెస్ నాయకురాలు

YS Sharmila Meets Chandrababu Naidu చంద్రబాబును కలిసిన వైస్ షర్మిల కుమారుడి పెళ్లికి ఆహ్వానం

షర్మిల ఇంట పెళ్లి సందడి - ఫిబ్రవరి 17న వైఎస్ రాజారెడ్డి వివాహం

YS Sharmila Son Marriage : ప్రజల పోరాటంలో భాగంగా విమర్శలు చేసుకోవటం సహజమని షర్మిల అన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగతంగా కక్షలు ఉండకూడదని, దాని వల్ల ఎలాంటి లావాదేవీలు ఉండవని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఏ బాధ్యతను అప్పగించినా శిరసా వహిస్తానని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని (Rahul Gandhi) ప్రధానిగా చేయడమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లక్ష్యంగా ఉండేదని, ఆ లక్ష్యాన్ని కొనసాగించేందుకు తనవంతు కృషి చేస్తానని వైఎస్ షర్మిల వెల్లడించారు.

షర్మిల కుమారిడి పెళ్లి ఆహ్వానానికి ఆమె పలువురు రాజకీయ ప్రముఖులను కలిసి వివాహ పత్రిక అందజేస్తున్నారు. ఇది వరకే సీఎం రేవంత్​ రెడ్డిని (CM Revanth Reddy) కలిసి వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చారు. కాగా ఆమె కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థం జనవరి 18న, వివాహం ఫిబ్రవరి 17వ తేదీన జరగనుంది.

సీఎం రేవంత్‌రెడ్డితో వైఎస్‌ షర్మిల భేటీ- కుమారుడి వివాహానికి ఆహ్వానం

సీఎం జగన్ నివాసానికి షర్మిల - కుమారుడి వివాహానికి ఆహ్వానం

Last Updated : Jan 13, 2024, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.