ETV Bharat / bharat

పట్టపగలే యువకుడిని కాల్చి చంపిన దుండగులు.. సరిహద్దులో విదేశీ యువకుడి హత్య! - Youth shot dead in Bihar Saharsa

పట్టపగలే ఓ యువకుడిన కాల్చి చంపారు ఇద్దరు దుండగులు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బిహార్​లో ఈ ఘటన జరిగింది. మరోవైపు, ఇదే రాష్ట్రంలో నేపాల్​ పౌరుడి మృతదేహం కలకలం రేపింది.

Youth shot dead in Bihar Saharsa
Youth shot dead in Bihar Saharsa
author img

By

Published : Jan 3, 2023, 8:16 AM IST

పట్టపగలే ఓ యువకుడిని కాల్చి చంపారు ఇద్దరు దుండగులు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన బిహార్​లోని సహస్ర జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం... అమిత్​ కుమార్​ అనే 18 ఏళ్ల యువకుడు గంహరియాలోని వార్డు నెంబర్​ 12లో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం బీఏ చదువుతున్నాడు. కాగా, అతడి ఫ్రెండ్ గౌరవ్​.. మార్కెట్​కు వెళ్దామని ఫోన్​ చేశాడు. దీంతో​ స్నేహితుడు చెప్పినట్లుగా మార్కెట్​కు నడుచుకుంటూ వెళ్తున్న అమిత్​ను.. బైక్​పై వచ్చిన ఇద్దరు నిందితులు కాల్చారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, ఇద్దరు నిందితులతో పాటు అమిత్​ ఫ్రెండ్​ గౌరవ్​ మీద కూడా మృతుడి తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ ఘటనపై స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.

బిహార్​లో నేపాల్​ పౌరుడు మృతి..
బిహార్​లో దారుణం జరిగింది. ఇండో నేపాల్​ సరిహద్దు ప్రాంతం అయిన జోగ్​బానిలోని వార్డ్​ నెంబర్​ 3లో నేపాల్​కు చెందిన యువకుడి మృతదేహం లభ్యమైంది. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై ఇరు దేశాల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన అరియానా జిల్లాలో జరిగింది.

అసలు ఏం జరిగిందంటే.. సోమవారం ఉదయం స్థానికులు ఓ మృతదేహాన్ని చూశారు. అనంతరం జోగ్​బాని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతుడి వివరాలు తెలియలేదు. ఈ ఘటనపై భారత్​, నేపాల్​కు చెందిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుడు వివరాలు తెలుసుకోవడానికి నేపాలీ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

పోలీసుల అనుమానాలు..
ఇండో నేపాల్​ బార్డర్​ ప్రాంతమైన ఇంద్రానగర్​లో మత్తు పదార్థాల అక్రమ రవాణా అధికంగా ఉంటుంది. దీంతో డ్రగ్స్​ సేవించడానికి నేపాల్​ ప్రజలు ప్రతిరోజు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తారు. ఈ ఘటన జరగడానికి ముందు కూడా.. ఈ ప్రాంతంలో చాలా మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో దొంగతనంలో భాగంగానే ఆ యువకుడిని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.