ETV Bharat / bharat

పదేళ్ల వయసులో పాముకాటుతో మృతి.. 15సంవత్సరాల తర్వాత తిరిగొచ్చిన యువకుడు

author img

By

Published : Feb 27, 2023, 7:51 PM IST

బిహార్​లో విచిత్ర ఘటన జరిగింది. చనిపోయాడనుకున్న వ్యక్తి 15 ఏళ్లకు తిరిగొచ్చాడు. 10 ఏళ్లప్పుడు పాము కాటుతో మృతి చెందినట్లు భావించిన అతడి కుటుంబ సభ్యులు.. అతడిని నదిలో వదిలేశారు. అనంతరం ఇన్నేళ్లకు ఇలా బ్రతికి వచ్చినందుకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

youth-returned-alive-after-15-years-who-died-snake-bite-in-deoria
15 ఏళ్ల తరువాత తిరిగొచ్చిన యువకుడు

15 ఏళ్ల క్రితం చనిపోయాడనుకున్న యువకుడు బతికొచ్చాడు. 10 ఏళ్ల వయస్సులో పాము కాటుతో మృతి చెందాడని భావించిన ఆ వ్యక్తి.. తిరిగి కుటుంబ సభ్యుల చెంతకు చేరాడు. దీంతో ఆ కుటుంబమంతా సంతోషంలో మునిగితేలుతోంది. ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని సైతం వ్యక్తం చేస్తోంది. ఈ విచిత్ర ఘటన బిహార్​లో జరిగింది. ఆ యువకుడిని చూసేందుకు ఊరంతా ఎగబడ్డారు.

పాము కాటుతో చనిపోయాడని..
15 ఏళ్లకు తిరిగొచ్చిన యువకుడి పేరు అంగేశ్ యాదవ్. అతడి తండ్రి పేరు రామ్‌సుమర్ యాదవ్. వీరు భాగల్​పుర్ జిల్లాలోని మురసో గ్రామంలో నివాసం ఉంటున్నారు. అయితే అంగేశ్​కు 10 ఏళ్లు ఉన్నప్పుడు పాము కరిచింది. ఆ సమయంలో అతడు నురగలు కక్కాడు. దీంతో అతడికి భూతవైద్యం చేయించారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అంగేశ్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో అంగేశ్​ను ఓ అరటి కాండంలో చుట్టి.. సరయూ నదిలో వదిలిపెట్టారు కుటుంబ సభ్యులు. తీరా చూస్తే.. 15 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమయ్యాడు అంగేశ్.

youth-returned-alive-after-15-years-who-died-snake-bite-in-deoria
గ్రామస్థులతో అంగేశ్

"పాము కరిచినప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు. స్పృహ వచ్చిన తరువాత నేను అమన్​ మాలి అనే వ్యక్తి దగ్గర ఉన్నట్లు తెలిసింది. ఆయన నన్ను బతికించారు. నన్ను పెంచిందీ ఆయనే. అమన్ మాలి పాములాడించే వ్యక్తి. ఆయనతో పాటే నేను చాలా ప్రాంతాలు తిరిగేవాడిని. కటీహార్​లో కొద్ది రోజులు ఉన్నాను. ఆ తరువాత అమన్​తో కలిసి పంజాబ్​లోని అమృత్​సర్​ వెళ్లాను. అక్కడ కొన్ని రోజులు ఓ వ్యవసాయదారుని వద్ద పనిచేశాను" అంగేశ్ తెలిపాడు.

అమృత్​సర్​లో​ ఉన్నప్పుడు తన గతం గురించి ఓ లారీ డ్రైవర్​కు చెప్పాడు అంగేశ్​. అతడు అంగేశ్​ను ఉత్తర్​ప్రదేశ్​లోని ఆజంగఢ్​కు తీసుకువచ్చాడు. అక్కడ మరికొంత మందికి తన ఊరు గురించి, ఊర్లో గుర్తున్న వ్యక్తుల పేర్లు చెప్పాడు. వారిలో ఒకరు అంగేశ్​ ఫొటో తీసి మురసో గ్రామంలో తెలిసిన వారికి పంపించారు. అంగేశ్ సైతం తన కుటుంబ సభ్యులను కలిసేందుకు.. మనియార్​ పోలీసులను సంప్రదించాడు. తన గురించి పోలీసులకు వివరంగా చెప్పాడు. చివరకు అంగేశ్​ గురించి అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. పోలీసు స్టేషన్​కు చేరుకున్న తల్లిని ఇతర కుటుంబ సభ్యులను.. అంగేశ్ గుర్తుపట్టాడు. తానే అంగేశ్ అని నిరూపించుకునేందుకు.. ఊర్లోని మరికొందరి పేర్లు, తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయుల పేర్లను చెప్పాడు. దీంతో అతనే అంగేశ్​ అని నిర్ధరించుకున్న పోలీసులు.. అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కుటుంబ సభ్యులతో అంగేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.