ETV Bharat / bharat

తల్లి వివాహేతర సంబంధం గురించి హేళన.. కోపంతో ఫ్రెండ్​ గొంతు నులిమి హత్య - బాలికపై అత్యాచారం

తన తల్లి వివాహేతర సంబంధం గురించి హేళన చేశాడని స్నేహితుడిని హత్య చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన బంగాల్​లో జరిగింది. మరోవైపు, పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. ఈ ఘటన రాజస్థాన్​లో వెలుగుచూసింది.

murder
హత్య
author img

By

Published : Dec 18, 2022, 11:35 AM IST

బంగాల్​లోని మాల్దాలో దారుణం జరిగింది. తన తల్లి వివాహేతర సంబంధం గురించి హేళన చేశాడని స్నేహితుడిని హత్య చేశాడో వ్యక్తి. మృతుడిని విష్ణుగా (25) పోలీసులు గుర్తించారు. నిందితుడు మంగళ్ పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
డిసెంబరు 9న మహానంద నది ఒడ్డున గుర్తు తెలియని మృతదేహం స్థానికులకు కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. డిసెంబరు 6న విష్ణు కనిపించట్లేదని అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు మృతుడి స్నేహితుడు మంగళ్​ను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

'విష్ణు తండ్రి నా తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలో పదేపదే విష్ణు నన్ను హేళన చేసేవాడు. డిసెంబరు 6 రాత్రి చెరుకు తోటలో మద్యం సేవించిన సమయంలో మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అందుకే విష్ణుని బెల్టుతో గొంతు నులిమి హత్య చేశా. అనంతరం మృతదేహాన్ని మహానంద నది ఒడ్డున పడేశా.' అని పోలీసుల విచారణలో మంగళ్ రవిదాస్​ తెలిపాడు.

మైనర్​పై గ్యాంగ్​రేప్​..
రాజస్థాన్​ అల్వార్​లో దారుణం జరిగింది. పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. బాధితురాలు తన తండ్రితో కలిసి పొలానికి వెళ్లిన సమయంలో ఆమెపై అఘాయిత్యం జరిగిందని వెల్లడించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరింపులకు దిగినట్లు చెప్పారు.

టీనేజర్​ మృతదేహం..
ఉత్తరప్రదేశ్ బదాయూలో ఘోరం జరిగింది. 17 ఏళ్ల బాలిక మృతదేహం పొలంలో కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. శనివారం జరిగిందీ ఘటన. బాధితురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. బాధితురాలి కుటుంబం పంజాబ్ నుంచి ఐదేళ్ల క్రితం వలసి వచ్చి బదాయూలో స్థిరపడింది.

టీనేజర్​పై గ్యాంగ్​రేప్​..
మహారాష్ట్ర.. పాల్ఘర్​లో దారుణం జరిగింది. 16 ఏళ్ల టీనేజర్​పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఎనిమిది మంది వ్యక్తులు. ఈ కేసులో నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు.. బాధితురాలిని ఓ బంగ్లాలో అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.