కర్ణాటక శివమొగ్గలో దారుణం జరిగింది. ఓ యువకుడు కొడవలితో భజరంగ్‌దళ్ కార్యకర్తపై దాడికి యత్నించాడు. సోమవారం ఉదయం జరిగిందీ ఘటన. ఈ దాడిలో సునీల్ అనే భజరంగ్‌దళ్ కార్యకర్త ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. సునీల్.. భజరంగ్‌దళ్ సాగర్ సిటీ కో-కన్వీనర్‌గా ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సాగర్ కొత్త బస్టాండ్‌లో సమీపంలో ఉన్న భజరంగ్‌దళ్ కార్యాలయానికి సునీల్ బైక్‌పై వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ యువకుడు సునీల్‌ను దగ్గరకు పిలిచాడు. బైక్‌లో నుంచి కొడవలిని తీసి అతడిపై దాడికి ప్రయత్నించాడు.
'నేను ఎప్పటిలాగే ఆఫీసుకు వెళ్తున్నాను. ఈ సమయంలో ఓ యువకుడు నన్ను అసభ్యంగా దూషించాడు. అతడి దగ్గరకు నేను బైక్‌పై వెళ్లగా కొడవలితో నాపై దాడికి యత్నించాడు.' అని సునీల్ తెలిపాడు.
సునీల్‌పై దాడిని భజరంగ్దళ్తో పాటు మరికొన్ని హిందూ సంఘాలు ఖండించాయి. సాగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగాయి. నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి.
ఇవీ చదవండి: