ETV Bharat / bharat

'కావాలని ఎవరూ బిచ్చగాళ్లుగా మారరు' - యాచకులు

యాచకులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కావాలని ఎవరూ బిచ్చగాళ్లుగా మారరని వ్యాఖ్యానించింది. యాచకులు వీధుల్లో తిరగకుండా తాము నిషేధం విధించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.

SC
సుప్రీం
author img

By

Published : Jul 28, 2021, 6:41 AM IST

యాచకులు వీధుల్లో తిరగకుండా తాము నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కావాలని ఎవరూ బిచ్చగాళ్లుగా మారరని వ్యాఖ్యానించింది. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో నిరాశ్రయులు, యాచకులకు పునరావాసం కల్పించాలని, టీకాలు ఇప్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాల్సిందిగా కేంద్రానికి, దిల్లీ ప్రభుత్వానికి తాఖీదులు జారీ చేసింది.

సామాజిక-రాజకీయ సమస్య..

విద్య, ఉపాధి లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బతుకు వెళ్లదీయడానికి కొంతమంది యాచకులుగా మారుతుంటారని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం మంగళవారం పేర్కొంది. సామాజిక-రాజకీయ సమస్యగా దాన్ని అభివర్ణించింది. బహిరంగ ప్రదేశాలు, ట్రాఫిక్‌ కూడళ్లలో యాచకులు, దేశ దిమ్మరులు, నిరాశ్రయుల సంచారాన్ని అడ్డుకునేలా అధికారులకు ఆదేశాలివ్వాలంటూ పిటిషన్‌లో చేసిన ఓ వినతిని తాము అనుమతించబోమని స్పష్టం చేసింది. వీధుల్లో యాచకులెవరూ ఉండకూడదనే 'శిష్టజన అభిప్రాయాన్ని' తాము పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టీకరించింది.

కరోనా కాలంలో యాచకులకు పునరావాసం కల్పించడం, టీకాలు వేయడం వంటి అంశాలపై మాత్రం కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలకు తాఖీదులు జారీ చేస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి: 'పెగాసస్​ను కేంద్రం ఉపయోగించిందా? లేదా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.