ETV Bharat / bharat

మగాడి వేషం వేసుకుని వచ్చి కోడలి దాడి.. తీవ్ర గాయాలతో అత్త మృతి - కుమార్తె కిడ్నాప్‌తో తల్లిదండ్రుల ఆత్మహత్య

అత్తను హత్య చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. పురుషుడిలా ప్యాంట్​, షర్ట్​ వేసుకుని హెల్మెట్​ పెట్టుకుని వచ్చి అత్తపై దాడి చేసింది ఓ కోడలు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అత్త.. చికిత్స పొందుతూ మృతి చెందింది. తమిళనాడు ఈ ఘటన జరిగింది.

women-murdered-mother-in-law-in-tamilanadu-beated-masquerading-as-man
పురుషుడిలా వేషం వేసుకుని అత్తపై దాడి
author img

By

Published : May 30, 2023, 9:06 PM IST

Updated : May 30, 2023, 10:07 PM IST

పురుషుడిలా వేషం వేసుకుని వచ్చి అత్తను అతి దారుణంగా కొట్టింది ఓ కోడలు. ప్యాంట్​, షర్ట్​ వేసుకుని, మొహం కనిపించకుండా హెల్మెట్​ ధరించి.. అర్థరాత్రి అత్త పడుకున్నాక ఇంట్లోకి ప్రవేశించింది. వెంట తెచ్చుకున్న ఓ పరికరంతో అత్తపై దాడి చేసింది. దీనిని దోపిడి దొంగల పనిగా నమ్మించేందుకు.. ఆమె నుంచి గోల్డ్​ చైన్​ను సైతం చోరీ చేసింది. దాడిలో తీవ్రంగా గాయపడిన అత్త.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. తిరునెల్వేలి జిల్లాలోని దూలుకర్కులం పంచాయతీ పరిధిలోని వడుకనపట్టి గ్రామంలో ఈ ఘటన జరిగింది. షణ్ముగవేల్ (63), సీతారామలక్ష్మి(58) భార్యభర్తలు. షణ్ముగవేల్ ఆ గ్రామానికి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరికి రామస్వామి అనే కొడుకు ఉన్నాడు. ఇతడికి మహాలక్ష్మికి వివాహం కాగా.. ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కొంత కాలంగా అత్త సీతారామలక్ష్మి, కోడలు మహాలక్ష్మికి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇరువురు వేర్వేరు ఇంట్లో నివాసం ఉంటున్నారు. గత పది రోజులుగా అత్తాకోడళ్ల మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో అత్తపై కోపం పెంచుకుంది మహాలక్ష్మి. ఈ క్రమంలోనే అత్తను హతమార్చాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం మే 29న మగాడిలా వేషం వేసుకుని అత్తింట్లోకి చొరబడింది. ఆమెను దారుణంగా కొట్టి.. గోల్డ్​ చైన్ లాగేసుకుంది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. మహాలక్ష్మి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితురాలి భర్త. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివిధ కోణాల్లో విచారణ జరిపారు. అనంతరం సీసీటీవీ కెమెరాలను పరిశీలించి.. బాధితురాలి కోడలే ఈ దారుణానికి పాల్పడినట్లు తేల్చారు. అనంతరం ఆమెను అరెస్ట్​ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జైలు తరలించారు.

కూతురు కిడ్నాప్​.. తల్లిదండ్రుల ఆత్మహత్య.. నిందితుడు ఇంటి ముందు మృతదేహాల ఖననం..
కూతురిని కిడ్నాప్​ చేశారనే బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు ఇద్దరు దంపతులు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు.. కిడ్నాప్​ చేసిన వ్యక్తి ఇంటి ముందు ఆ మృతదేహాన్ని ఖననం చేశారు. మహారాష్ట్రలోని నాసిక్​ జిల్లాలో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నివృత్తి కిసాన్ ఖతాలే (49), మంజుల నివృత్తి ఖతాలే (40) భార్యభర్తలు. వీరిద్దరు సిన్నార్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివాసం ఉంటున్నారు. వీళ్లకు ఓ 19 ఏళ్ల కూతురు ఉంది. కాగా ఇగత్‌పురిలోని భర్వీర్ బుద్రుక్ గ్రామానికి చెందిన సాధన్ జంకార్ అనే యువకుడు.. వీళ్ల కూతురుని ప్రేమ పేరుతో ఇబ్బంది పెడుతుండేవాడు. పెళ్లి చేసుకోమని వేధిస్తుండేవాడు. ఇదిలా ఉండగా ఆదివారం కూతురితో కలిసి తల్లిదండ్రులిద్దరు ద్విచక్ర వాహనంపై బయటకు వెళుతున్నారు. అదే సమయంలో కారులో వచ్చిన సాధన్ జంకార్.. తన అనుచరులతో కలిసి యువతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఆదివారం రాత్రి ఘోటీ-పంధుర్లి హైవేపై ఈ ఘటన జరిగింది.

దీంతో తీవ్ర మనోవేదనకు గురైన యువతి తల్లిదండ్రులు.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై సమచారం అందుకున్న రైల్వే పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్ట్​మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. యువతిని తల్లిదండ్రుల అత్మహత్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన.. గ్రామస్థులు, బంధువులు వారి మృతదేహాలను సాధన్ జంకార్ ఇంటి ముందు ఖననం చేశారు.

Last Updated : May 30, 2023, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.