ETV Bharat / bharat

మహిళపై తాంత్రికుడి అత్యాచారం.. 79 రోజులు నరకం - assam rape news

Woman Raped by Tantrik: కుటుంబ కలహాలను పరిష్కరిస్తానని చెప్పి ఓ మహిళపై 79 రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ తాంత్రికుడు. అది కూడా ఆమె రెండున్నర ఏళ్ల కొడుకు ముందే. ఈ దారుణం ఒడిశాలో జరిగింది. మరో ఘటనలో నాలుగేళ్ల కింద ఆరేళ్ల చిన్నారిని రేప్ చేసి హతమార్చిన అసోం వ్యక్తికి జీవిత ఖైదు పడింది.

Woman raped by tantrik
odisha crime news
author img

By

Published : May 7, 2022, 5:31 PM IST

Woman Raped by Tantrik: ఒడిశాలోని బాలాసోర్​ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తన రెండున్నర ఏళ్ల కొడుకు ముందే ఓ మహిళను 79 రోజుల పాటు అత్యాచారం చేశాడు ఓ తాంత్రికుడు. శుక్రవారం మహిళను, చిన్నారిని రక్షించిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. "తమ మధ్య ఉన్న గొడవల పరిష్కారానికి అత్తింటివారు తనను బలవంతంగా ఓ తాంత్రికుడి వద్ద ఉంచినట్లు మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది. 2017లో ఆమె వివాహం జరిగింది. అప్పటినుంచి కట్నం కోసం అత్తింటివారి నుంచి మానసిక, శారీరక వేధింపులకు గురైనట్లు మహిళ పేర్కొంది. ఈ క్రమంలోనే కొన్ని నెలల పాటు మహిళను తన వద్ద ఉంచితే ఈ విభేదాలను పరిష్కరిస్తానని తాంత్రికుడు ఆ కుటుంబానికి భరోసా ఇచ్చాడు. ఇందుకు ఆ మహిళ నిరాకరించగా, అత్తింటివారు ఆమెకు మత్తు మందు ఇచ్చి తాంత్రికుడి ఇంటికి తీసుకెళ్లారు. స్పృహలోకి రాగానే తన కొడుకుతో పాటు ఆ మహిళ తాంత్రికుడి గదిలో ఉన్నట్లు గుర్తించింది." అని పోలీసులు తెలిపారు.

కొడుకు ముందే మహిళను 79 రోజుల పాటు తాంత్రికుడు అత్యాచారం చేశాడు. ఆమెకు, చిన్నారికి నిందితుడు ఆహారం అందించేవాడు. ఏప్రిల్​ 28న నిందితుడు గదిలోనే మొబైల్​ ఫోన్​ను వదిలిపెట్టడాన్ని గుర్తించిన మహిళ.. దాని ద్వారా తన బంధువులకు సమాచారాన్ని అందించింది. వారి ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. అయితే పోలీసులు వచ్చేసరికే తాంత్రికుడు తప్పించుకున్నాడు. అత్యాచారం సహా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదైంది. భర్త, అతడి సోదరుడు సహా అత్తింటివారి పేర్లను ఎఫ్​ఐఆర్​లో చేర్చారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

మృగాడికి జీవితఖైదు: నాలుగేళ్ల క్రితం ఓ మైనర్​ను రేప్​ చేసి దారుణంగా హత్య చేసిన అసోం వ్యక్తికి రాష్ట్రంలోని స్థానిక కోర్టు జీవిత ఖైదు విధించింది. 2018లో గోల్పారా జిల్లాలో ఓ ఆరేళ్ల చిన్నారిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు కలు ముండా అనే నిందితుడు. అతడిని పోక్సో చట్టం కింద దోషిగా తేలుస్తూ న్యాయస్థానం శుక్రవారం ఈ మేరకు తీర్పు చెప్పింది.

ఇదీ చూడండి: జననాంగాలను కొరికి వ్యక్తి హత్య.. షాక్​లో పోలీసులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.