ETV Bharat / bharat

యువతిపై తండ్రీకొడుకులు రేప్​.. స్కూల్​ టాయిలెట్​లో చిన్నారికి జన్మనిచ్చిన మైనర్​ - భార్య ముఖంపై యాసిడ్ పోసిన భర్త

ఓ యువతిపై ఆమె ప్రియుడు, అతడి తండ్రి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, ఓ మైనర్​.. పాఠశాల టాయిలెట్​లో శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఆ చిన్నారిని నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి వెళ్లిపోయింది. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్​లో వెలుగుచూసింది.

rape
అత్యాచారం
author img

By

Published : Nov 28, 2022, 10:30 AM IST

Updated : Nov 28, 2022, 10:54 AM IST

మధ్యప్రదేశ్ భోపాల్​లో దారుణం జరిగింది. ఓ యువతిపై ఆమె ప్రియుడు, అతడి తండ్రి అత్యాచారానికి పాల్పడ్డారు. యువతిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఆమెపై ప్రియుడు పలుమార్లు అఘాయిత్యం చేశాడు. అనంతరం అతడు పెళ్లికి నిరాకరించడం వల్ల యువతి.. ప్రియుడి తండ్రికి ఫిర్యాదు చేసింది. తన కొడుకుతో పెళ్లి చేస్తానని యువతిని నమ్మించి.. నిందితుడి తండ్రి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అత్యాచార ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలు భోపాల్​లోని ఓ కాస్మోటిక్ షాప్‌లో పనిచేసేదని.. అక్కడే సహోద్యోగైన నిందితుడితో పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు.

స్కూల్ టాయిలెట్​లో..
రాజస్థాన్​ కోటాలో ఓ మైనర్​.. పాఠశాలలోని టాయిలెట్​లో బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం నవజాతశిశువును నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నవజాతశిశువును ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం శిశువు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పేర్కొన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బాధితురాలిపై 11 నెలలుగా అత్యాచారానికి పాల్పడతున్నాడు 21 ఏళ్ల యువకుడు. నిందితుడు.. బాధితురాలికి బంధువే. మైనర్​ తన అమ్మమ్మ ఇంటికి వెళ్తుండేది. అదే గ్రామానికి చెందిన యువకుడు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది.

కోర్టు ఆవరణలో ట్రిపుల్ తలాక్​..
కోర్టు ఆవరణలోనే ఓ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని ఇందోర్​లో వెలుగుచూసింది. భర్తపై బాధితురాలు పెట్టిన వరకట్న వేధింపుల కేసు విచారణకు ముందు ఈ ఘటన జరగడం గమనార్హం. నిందితుడు అజహర్​పై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పెళ్లైన తర్వాత నిందితుడు అజహర్​ తన భార్యను అదనపు కట్నం కోసం వేధించేవాడు. అయితే బాధితురాలి కుటుంబానికి అదనపు కట్నం ఇచ్చేంత ఆర్థిత స్తోమత లేదు. దీంతో అజహర్ కుటుంబం నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం బాధితురాలు తన పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఈ కేసు గురువారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సమయంలో కోర్టు ఆవరణలో నిందితుడు, బాధితురాలికి తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం ట్రిపుల్​ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేశాడు అజహర్.

భార్య ముఖంపై యాసిడ్ దాడి..
ఝార్ఖండ్.. రాంచీలో దారుణం జరిగింది. నామ్​కుమ్​లో నివసిస్తున్న అమీర్​ అనే వ్యక్తి తన భార్య హీనా ముఖంపై యాసిడ్ పోశాడు. ఈ దాడిలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబ వివాదాలే ఈ దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

కాల్పుల్లో ఇద్దరు మృతి..
బిహార్ భాగల్​పుర్​లో ఘోరం జరిగింది. రెండు గ్రూపుల మధ్య జరిగిన కాల్పులో ఇద్దరు యువకులు మరణించారు. మృతులను సన్నీ పాశ్వాన్, రోహిత్ రజక్‌గా పోలీసులు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ యూట్యూబర్.. వీడియో షూట్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

Last Updated : Nov 28, 2022, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.