ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడి గొంతు కోసి హత్య చేసింది ఓ మహిళ. అనంతరం.. ఆ మృతదేహాన్ని పడేసేందుకు సూట్‌కేస్‌లో తరలిస్తూ పోలీసులకు చిక్కింది. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిని సంభల్ ప్రాంతానికి చెందిన ఫిరోజ్‌గా గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితురాలు ప్రీతి శర్మ తన భర్త దీపక్‌ను విడిచిపెట్టి, నాలుగేళ్లుగా ఫిరోజ్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఫిరోజ్‌ను ఆమె పెళ్లిచేసుకోవాలని భావించగా.. అందుకు అతడు నిరాకరించాడు. దీంతో.. పక్కా పథకం ప్రకారం రేజర్‌తో యువకుడి గొంతు కోసి చంపింది. అనంతరం.. మృతదేహాన్ని పడేసేందుకు దిల్లీలోని సీలంపుర్ ప్రాంతంలో పెద్ద సూట్‌కేసు కొనుగోలు చేసి తీసుకెళ్లింది. అనుమానించిన పోలీసులు.. మహిళను అనుసరించారు. సూట్‌కేసులో మృతదేహాన్ని చూసి విచారించగా అసలు విషయం తెలిసింది. ఫిరోజ్.. దిల్లీలో హెయిర్ డ్రెస్సర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కోరిక తీర్చలేదని.. లైంగిక వాంఛ తీర్చనందుకు యువతిని ఇనుప రాడ్డుతో తలపై కొట్టి.. ట్రక్కు నుంచి కిందకు పడేశాడు ఓ డ్రైవర్. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్.. మథురాలోని దిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిపై జరిగింది. నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. శనివారం ఈ ఘటన జరిగింది.
ఓ ఫార్మా కంపెనీలో పనిచేసే యువతి కోసికాలన్ వద్ద రోడ్డు పక్కన నిల్చొని ఉంది. అప్పుడే అటుగా వచ్చిన ట్రక్కు డ్రైవర్ లిఫ్ట్ ఇస్తానని ఆమెను వాహనం ఎక్కేలా చేశాడు. కొద్దిసేపటికి ఆమెపై లైంగిక వేధింపులు ప్రారంభించాడు. ప్రతిఘటించిన యువతి సాయం చేయమంటూ గట్టిగా అరిచింది. గమనించిన వాహనదారులు.. ట్రక్కును అనుసరించిన తరుణంలో నిందితుడు ఆమె తలపై రాడ్డుతో కొట్టి బయటకు విసిరేశాడు. బాధితురాల్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించగా.. ట్రక్కు డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
మైనర్లపై ప్రిన్సిపల్ వేధింపులు.. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ స్కూల్ ప్రిన్సిపల్.. పిల్లలపై దారుణానికి తెగించాడు. ఇద్దరు విద్యార్థినులను లైంగికంగా వేధించాడు. 5,7 తరగతులకు చెందిన ఇద్దరు బాలికలు తమ ఇంట్లో విషయం చెప్పగా.. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ సుర్జాపుర్‌లో జరిగింది.
ఆశ్రమ పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం.. ఆశ్రమ పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం చేశాడు సూపరింటెండెంట్. ఈ ఘటన మహారాష్ట్ర చంద్రాపుర్లో జరిగింది. 13 ఏళ్ల బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.
ప్రియురాలికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. ప్రియురాలికి మత్తుమందు ఇచ్చి బలవంతంగా అత్యాచారం చేశాడు 32 ఏళ్ల వ్యక్తి. ఈ ఘటన రాజస్థాన్ జోధ్‌పుర్‌లో జరిగింది. అనంతరం ఆమె చనిపోయింది. బాధితురాలి మృతికి స్పష్టమైన కారణం తెలియరాలేదు. డ్రగ్ ఓవర్‌డోస్ వల్లే చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు బాధితురాలికి దగ్గరి బంధువని, ఐదేళ్లుగా ఇద్దరికీ పరిచయం ఉందని తెలుస్తోంది.
ఇవీ చూడండి: దళితుడిపై దారుణం.. ఏ మతమో చెప్పాలని స్తంభానికి కట్టేసి, బట్టలు విప్పి..
మహిళల ముందు అసభ్య ప్రవర్తన.. 'అవి' చూపించాడని రహస్య భాగాలపై పెట్రోల్ పోసి..