ETV Bharat / bharat

52 ఏళ్ల న్యాయపోరాటానికి దక్కిన ఫలితం.. 'ఆమె'కు రూ.16 లక్షల పెన్షన్! - మహిళకు పెన్షన్

భర్త మరణానంతరం తనకు రావాల్సిన పింఛను సొమ్ము కోసం ఓ మహిళ 52 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేశారు. ఎట్టకేలకు 89 ఏళ్ల వయసులో రూ.16 లక్షలు అందుకున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

Woman gets Pension Money 52 Years After Husbands Death  in odisha
Etv Woman gets Pension Money 52 Years After Husbands Death in odisha
author img

By

Published : Sep 23, 2022, 10:32 PM IST

ఒడిశాకు చెందిన ఓ మహిళ తన భర్త మరణించిన తర్వాత అందాల్సిన పింఛను సొమ్ము కోసం 52 ఏళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. 89 ఏళ్ల వయసులో ఆమెకు రూ.16 లక్షల తాత్కాలిక పెన్షన్ వచ్చింది.

ఇదీ జరిగింది..
బాలేశ్వర్​ జిల్లాలోని ఆరాద్ బజార్‌కు చెందిన లలితా మొహంతి 37 సంవత్సరాల వయస్సులో తన భర్త భీమ్‌సేన్​ను కోల్పోయారు. ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో భీమ్​సేన్​ పనిచేస్తూ కన్నుమూశారు. ఆయన మరణానంతరం.. లలితకు ఓఎస్​ఆర్టీసీ నుంచి ఎటువంటి పెన్షన్ రాలేదు. అందుకు లలిత సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. ఎట్టకేలకు ఆమెకు న్యాయం జరిగింది. తొమ్మిదేళ్ల క్రితం కోర్టు ఇచ్చిన ఆదేశాలనుసారం.. లలితకు ఓఎస్​ఆర్టీసీ రూ.16 లక్షలు చెల్లించింది.

లలిత

ఇవీ చదవండి: 'రూ.25 కోట్లు గెలిచాక మనశ్శాంతి లేదు.. అందరు అప్పులు అడుగుతున్నారు'

కి'లేడీ' వివాహాలు.. ఆరుగురిని మనువాడిన మహిళ.. ఏడోసారి పెళ్లి పీటలు ఎక్కుతూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.