ETV Bharat / bharat

'చెకింగ్ సమయంలో మహిళ షర్ట్​ తొలగించాలన్న విమానాశ్రయ అధికారులు!' - ఎయిర్‌పోర్ట్‌లో సెక్కూరిటీ అధికారుల వేధింపులు

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తన చొక్కా తీసేయాలని వేధించారంటూ.. ఓ మహిళా సంగీత విద్వాంసురాలు ట్వీట్​ చేశారు. దీనిపై స్పందించిన విమానాశ్రయ అధికారులు.. తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.

Kempegowda international airport
కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం
author img

By

Published : Jan 4, 2023, 7:13 PM IST

కర్ణాటక బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్​ ఎయిర్‌పోర్ట్‌లో సెక్కూరిటీ అధికారులు వేధింపులకు గురిచేశారని ఓ మహిళ ఆరోపించారు. చెకింగ్​ సమయంలో సీఐఎస్​ఎఫ్​ అధికారులు తన చొక్కా తొలగించాలని వేధించినట్లు ఆమె ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ ట్వీట్​ను తొలగించి.. అకౌంట్​ను డీయాక్టివేట్​ చేశారు.

ఓ మహిళా సంగీత విద్వాంసురాలు మంగళవారం.. బెంగళూరు నుంచి అహ్మదాబాద్​కు వెళ్లడానికి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లారు. అయితే అక్కడ చెకింగ్​ సమయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు.. తనను చొక్కా తీసేయమని అడిగినట్లు ఓ ట్వీట్​లో పేర్కొన్నారు. 'ఇది చాలా అవమానకరమైన అనుభవం' అని ఆమె తన ట్వీట్​లో వెల్లడించారు.

"బెంగళూరు విమానాశ్రయంలో భద్రతా తనిఖీల సమయంలో నా షర్ట్‌ తీసివేయమని అడిగారు. సెక్యూరిటీ చెక్‌పాయింట్‌లో నేను లోదుస్తులు మాత్రమే ధరించి ఉన్నాను. ఓ మహిళగా దీన్ని ఎప్పటికీ మరచిపోలేను.. నిజంగా చాలా అవమానకరంగా ఉంది. @BLRAirport ఓ మహిళ బట్టలు తీయవలసిన అవసరం మీకు ఏం వచ్చింది?"
-- ఆ మహిళ చేసిన ట్వీట్​

బుధవారం ఉదయం ఆమె ఆ ట్వీట్​ను తొలగించారు. ఆ తర్వాత తన ట్విట్టర్ అకౌంట్​ను డీయాక్టివేట్ చేశారు. ఈ ట్వీట్​కు సంబంధిత అధికారులు విమానాశ్రయ అధికారిక ట్విట్టర్ హ్యాండల్​ నుంచి స్పందించారు. "తీవ్రంగా చింతిస్తున్నాము.. ఇలా జరగకూడదు. మేము దీనిని మా ఉన్నత అధికారులకు తెలియజేశాము. సీఐఎస్​ఎఫ్​ భద్రతా బృందానికి కూడా నివేదించాము" అని బెంగళూరు విమానాశ్రయ అధికారులు రిప్లై ఇచ్చారు. దీనిపై ఉన్నత అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.