ETV Bharat / bharat

వామ్మో​.. ఈ చికెన్​ ఎగ్​ రోల్​ ఎంత పెద్దదో! - Long Chiken Egg Roll

చికెన్ ఎగ్ రోల్​ ఇప్పటికే మీరు ఎన్నోసార్లు తిని ఉంటారు. కానీ రెండు అడుగులు ఉన్న రోల్​ ఎప్పుడైనా తిన్నారా? పోనీ చూశారా? లేకపోతే ఈ స్టోరీ చదివేయండి. దాని గురించి తెలుసుకోండి.

egg roll
ఎగ్​ రోల్​
author img

By

Published : Aug 4, 2021, 6:01 PM IST

నాన్​వెజ్ ప్రియులకు చికెన్ అంటే యమా ఇష్టం. ఇక చికెన్​ ఎగ్​ రోల్​ చూస్తే తినకుండా ఉండలేరు. చాలా చోట్ల ఇది దొరుకుతుంది. అయితే దిల్లీలోని మోడల్​ టౌన్​ ఏరియాలో దొరికే చికెన్​ ఎగ్​ రోల్​ చాలా ఫేమస్! ఎందుకంటే ఇక్కడ దొరికే సైజులో ఎగ్​ రోల్​ను మీరు ఇప్పటివరకు ఎక్కడా చూసి ఉండరు! రెండు అడుగులు ఉండే ఈ స్పైసీ రోల్​ను అక్కడి ఆహార ప్రియులు తెగ లాగించేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ఫుడ్​ వ్లాగర్ ​ఇన్​స్టాలో పోస్ట్​ చేయగా, అదికాస్త ఇప్పుడు వైరల్​గా మారింది.

ఈ చికెగ్​ ఎగ్​ రోల్​లో పది గుడ్లు సహ ఎక్కువ మొత్తంలో కోడి మాంసాన్ని కలిపి తయారుచేస్తారు మోడల్​ టౌన్​ ఏరియాలోని పాట్నా రోల్​ సెంటర్​ హోటల్ నిర్వాహకులు. దీని ధర రూ.600. ఈ ఐటెమ్​ శాకాహారంలోనూ దొరుకుతుంది. దీని ధర రూ. 400. మీరు ఈ రోల్​ను తినాలని అనుకుంటే మీకు కావాల్సిన పరిణామంలో ఇంట్లోనే వండటానికి ప్రయత్నించండి!

​ఇదీ చూడండి: రుచికరమైన చికెన్​ ఫ్రాంకీ చేసుకోండిలా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.