ETV Bharat / bharat

గుడిలోకి దూరిన ఏనుగు.. బైక్, షాప్ ధ్వంసం! - wild elephant news

తమిళనాడులో ఓ అడవి ఏనుగు హల్​చల్ (Erode District news) సృష్టించింది. అడవి నుంచి తప్పించుకొని వచ్చిన గజరాజు.. ఓ మందిరంలోకి (Amman Temple in Tamilnadu) ప్రవేశించి.. స్థానికులను ఆందోళనకు గురి చేసింది. ఓ ద్విచక్రవాహనాన్ని, తోపుడు బండిని ధ్వంసం చేసింది.

Wild elephant entered famous temple of TamilNadu
తమిళనాడు అడవి ఏనుగు
author img

By

Published : Oct 9, 2021, 6:36 PM IST

గుడిలోకి దూరిన ఏనుగు

తమిళనాడు ఈరోడ్​ జిల్లాలో (Erode District news) ఉన్న బన్నారి అమ్మన్ మందిరంలోకి (Amman Temple in Tamilnadu) ఓ అడవి ఏనుగు చొరబడింది. సమీపంలో ఉన్న సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఈ గజరాజు వచ్చినట్లు తెలుస్తోంది. మందిరం పరిసరాల్లో తిరిగిన ఏనుగు.. అక్కడి ద్విచక్ర వాహనాన్ని, ఓ తోపుడు బండిని ధ్వంసం (Elephant Destroys) చేసింది. భయాందోళనకు గురైన స్థానికులు.. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

Wild elephant entered famous temple of TamilNadu
ఆలయ పరిసరాల్లో గజరాజు

.

వెంటనే మందిరం వద్దకు చేరుకున్న అధికారులు.. ఏనుగును నియంత్రించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ద్విచక్ర వాహనం, తోపుడు బండి ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. ఓ దశలో అధికారులపైకి ఏనుగు దూసుకొచ్చింది.

ఆలయ పరిసరాల్లో ఏనుగు

అరగంట పాటు ప్రయత్నించిన అనంతరం ఏనుగును.. అడవిలోకి తిరిగి పంపించగలిగారు అధికారులు. గజరాజును భయపెట్టేందుకు టపాసులు కాల్చారు.

ఇదీ చదవండి: ఒక్కరాత్రిలో 21 శునకాలు మృతి- అసలేమైంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.