ETV Bharat / bharat

రూ.45లక్షల కోసం కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య - గ్రేటర్ నోయిడా వార్తలు

రూ. 45లక్షల కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చింది భార్య. ఈ కేసులో నిందితురాలితోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

accused with police
భర్తను హతమార్చిన భార్య
author img

By

Published : Jul 26, 2021, 9:45 AM IST

ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ధనాశ చిచ్చుపెట్టింది. రూ.45 లక్షల కోసం తన మరిదితో కలిసి.. కట్టుకున్న భర్తనే హతమార్చింది ఓ భార్య. ముందు మిస్సింగ్​ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులకు.. విచారణలో విస్తుపోయే నిజాలు తెలిశాయి.

ఏం జరిగిందంటే?

ఉత్తర్​ప్రదేశ్​ గ్రేటర్ నోయిడాలోని గర్హీ షాహ్​దరాలో నివాసం ఉండే అజిత్, కవిత దంపతులకు ఇద్దరు పిల్లలు. అజిత్.. ఇటీవల ఓ ఫ్లాట్​ అమ్మగా రూ.45లక్షలు వచ్చాయి. ఈ డబ్బును బ్యాంకులో వేశాడు. దీన్ని ఎలాగైనా రాబట్టాలని కవిత.. తన మరిదితో కలిసి పథకం పన్నింది. అనుకున్నట్లుగానే.. అజిత్​ను హతమార్చి బులంద్​షహర్​ కల్పా గ్రామం వద్ద ఉన్న నదిలో పడేసింది.

accused with police
పోలీసుల అదుపులో నిందితులు

మేనల్లుడి ఫిర్యాదుతో..

అజిత్​.. కనబడకపోవటం వల్ల అతని మేనల్లుడు సూరజ్ జూన్​ 30న సూరజ్​పుర్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ముందు మిస్సింగ్​ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. తర్వాత అనుమానం వచ్చి అజిత్ భార్యను తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది.

కవితతో పాటు.. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇదీ చదవండి: ప్రేమించాడని.. యువకుడి మర్మాంగం కోసి దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.