ETV Bharat / bharat

మానసిక రోగుల మధ్య ప్రేమ.. కుంగుబాటును జయించి, భార్యాభర్తలుగా కొత్త జీవితం

ఓ మానసిక వైద్యశాల.. ఇద్దరు రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. చికిత్స కోసం వచ్చిన వారిని ఒక్కటి చేసింది. మానసిక కుంగుబాటు నుంచి కోలుకుని, ప్రేమలో పడ్డ ఆ ఇద్దరూ.. శుక్రవారం పెళ్లి చేసుకోబోతున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Oct 28, 2022, 11:05 AM IST

Updated : Oct 28, 2022, 11:26 AM IST

మహేంద్రన్ వయస్సు 42 సంవత్సరాలు. చెనైకి చెందిన వ్యక్తి. రెండేళ్ల క్రితం మానసికంగా బాధ పడుతూ చికిత్స కోసం చెనైలోని కల్పకం మానసిక వైద్యశాలకు వెళ్లాడు. వెల్లూరుకు చెందిన దీప సైతం మానసిక సమస్యలతో అక్కడికి వెళ్లింది. ఆమెకు 36 సంవత్సరాలు. అక్కడే ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఒక్కటి కాబోతున్నారు.
దీపను మొదటిసారి చూసినప్పుడు తన అమ్మలా అనిపించిందని చెప్పాడు మహేంద్రన్.

"కుటుంబ సమస్యలతో, ఆస్తి వివాదాలతో సతమతమవుతూ మానసికంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. అనంతరం కల్పకం మానసిక వైద్యశాలకు చికిత్స నిమిత్తం వెళ్లాను. మొదట డాక్టర్ ఇచ్చిన సలహాలను తిరస్కరించి తిరిగొచ్చాను. మరోసారి అదే ఆసుపత్రికి వెళ్లి చికిత్సను తీసుకున్నాను. ఆ తరువాత అక్కడి కేర్ సెంటర్​లో పనిచేశాను. అప్పుడే దీప సైతం చికిత్స కోసం వచ్చింది. ఆమె ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ద తీసుకున్న నేను నా మనసులోని మాటను ఆమెతో చెప్పాను. ముందుగా కాస్త సమయం అడిగినప్పటికి ఆ తరువాత తానే వచ్చి పెళ్లి చేసుకుందామంది."
-మహేంద్రన్

"మా నాన్న 2016 సంవత్సరంలో చనిపోయాడు. అయన మరణం తట్టుకోలేక మానసికంగా కుంగిపోయా. అదే ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లినప్పుడు మహేంద్రన్ పరిచయమయ్యాడు. మా పరిచయం పెళ్లి వరకు వెళ్లింది. నా జీవితంలో పెళ్లి జరుగుతుందని కలలో సైతం అనుకోలేదు."
--దీప

"మహేంద్రన్, దీప పూర్తిగా కోలుకున్నారు. వారి కోరిక మేరకు పెళ్లికి అనుమతి ఇచ్చాం." అని తెలిపారు కల్పకం ప్రభుత్వ మానసిక వైద్యశాల డాక్టర్ సంగీత. ప్రస్తుతం ఇద్దరూ ఇదే మానసిక ఆసుపత్రి ఆశ్రమంలో పనిచేస్తున్నారు. వారి కోసం అక్కడి కార్మికులు, స్నేహితులు ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే వెట్రి అళగన్‌ అధ్వర్యంలో ఆస్పత్రిలోనే వీరి వివాహం జరగనుంది.

mental institution recovered and married tomorrow
ఆసుపత్రిలో ఒక్కటైన మానసిక రోగులు

Last Updated : Oct 28, 2022, 11:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.