ETV Bharat / bharat

Bhabanipur bypoll: 'భవానీపుర్​లో విజయం దీదీది- మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ నాది' - భవానీపుర్ కౌంటింగ్​

The fate of West Bengal Chief Minister Mamata Banerjee, which was sealed in the ballot boxes, will be known as the counting for the Bhabanipur and two other Assembly constituencies will begin here on Sunday at 8 am amid high security. The polling was conducted in Bhabanipur, Jangipur and Samserganj Assembly constituencies on September 30. Twenty four companies of Central Forces have been deployed at the counting centres and the entire area was put under CCTV surveillance.

Bhbanipur bypoll
భవానీపుర్ ఉప ఎన్నికల ఫలితాలు
author img

By

Published : Oct 3, 2021, 8:11 AM IST

Updated : Oct 3, 2021, 4:04 PM IST

16:02 October 03

నాకే మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​​: టిబ్రేవాల్​

భవానీపుర్​ ఎన్నికల్లో మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ తనకే దక్కుతుందన్నారు భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్​. 25వేలకుపైగా ఓట్లు సాధించినట్లు చెప్పారు.  

" మమతా బెనర్జీకి మంచి పట్టున్న ప్రాంతంలో పోటీ చేసి.. 25వేలకుపైగా ఓట్లు సాధించాను.  ఈ గేమ్​లో నేనే మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచాను. రాష్ట్రం, ప్రజల కోసం కష్టపడి పనిచేయటాన్ని కొనసాగిస్తాను. "

- ప్రియాంక టిబ్రేవాల్​, భాజపా అభ్యర్థి. 

15:06 October 03

ఓటు వేసిన ప్రజలకు, ఈసీకి దీదీ కృతజ్ఞతలు

భవానీపుర్​లో ఘన విజయం సాధించారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ సందర్భంగా భవానీపూర్​ ప్రజలకు, ఎన్నికలు సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. 

" భవానీపూర్​ అసెంబ్లీ ఉప ఎన్నికలో 58,832 ఓట్ల తేడాతో గెలుపొందాను. నియోజకవర్గంలోని ప్రతి వార్డులో విజయం నమోదు చేశాం. బంగాల్​లో ఎన్నికలు మొదలైనప్పటి నుంచి మనల్ని అధికారంలో నుంచి దించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. నా కాలికి గాయమైతే ఎన్నికల్లో పోటీ చేయని అనుకున్నారు. మాకు ఓటు వేసినందుకు ప్రజలకు, ఆరు నెలల్లోనే ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల సంఘానికి నా కృతజ్ఞతలు.  భవానీపుర్​లో 46 శాతానికిపైగా ప్రజలు బెంగలీలు కాదు. వారంతా నాకోసం ఓటు వేశారు. భవానీపుర్​ పరిస్థితులను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. "

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి. 

14:08 October 03

మమత ఘన విజయం..

భవానీపుర్ ఉపఎన్నికలో(Bhabanipur by poll) టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) విజయ ఢంకా మోగించారు.తన సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై భారీ ఆధిక్యాన్ని నమోదు చేశారు. తొలి రౌండ్‌ నుంచీ మమత ఆధిపత్యం కొనసాగించారు. 58,389 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగరవేశారు. ఈ విజయంతో మమత సీఎం పీఠాన్ని నిలబెట్టుకున్నారు.

భవానీపుర్​లో(Bhabanipur by poll) దీదీకి అసలు ఎదురే లేదని ఈ ఉప ఎన్నికతో మరోసారి నిరూపితమైంది. తొలి రౌండ్​లోనే స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించారు దీదీ. ఆ తర్వాత రౌండ్ రౌండ్​కూ మెజారిటీ పెరుగుతూ వచ్చింది. తొలిరౌండ్​ పూర్తయ్యే సరికి.. 3,680, రెండో రౌండ్ తర్వాత 3,861, నాలుగో రౌండ్ అనంతరం 12,435 మెజారిటీ సంపాదించారు. మొత్తం 21 రౌండ్ల పాటు కౌంటింగ్ జరగింది. సెప్టెంబర్​ 30న ఈ భవానీపుర్​ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. 53 శాతం పోలింగ్ నమోదైంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడిపోయిన మమతా బెనర్జీ.. ఈసారి భవానీపుర్‌ నుంచి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఆమెపై భాజపా తరఫున ప్రియాంక టిబ్రేవాల్‌, సీపీఐ(ఎం) నుంచి శ్రీజిబ్‌ బిశ్వాస్‌ పోటీలో ఉన్నారు. సీఎంగా కొనసాగాలంటే తప్పక గెలవాల్సిన ఈ ఎన్నికలో మమత విజయం సాధించారు.

13:30 October 03

39,656 ఓట్ల ఆధిక్యం..

15వ రౌండ్​ కౌంటింగ్​ ముగిసేసరికి.. భవానీపుర్ ఉపఎన్నిక ఫలితాల్లో టీఎంసీ అభ్యర్థి మమతా బెనర్జీ.. తన సమీప భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్​పై 39,656 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

13:15 October 03

విజయోత్సవాలు వద్దు..

బంగాల్​ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో లేదా లెక్కింపు పూర్తయ్యాక విజయోత్సవ సంబరాలు, ఊరేగింపులు వంటివి జరగకుండా చూడాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్​ ఆదేశించింది. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈమేరకు రాష్ట్రప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. 

12:32 October 03

11వ రౌండ్​లో 34వేలు..

11వ రౌండ్ కౌంటింగ్​ ముగిసిన తర్వాత.. భవానీపుర్​ ఉపఎన్నిక ఫలితాల్లో బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 34వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

12:26 October 03

31వేలు దాటిన ఆధిక్యం..

బంగాల్ ఉపఎన్నికల ఫలితాల్లో తృణమూల్​ కాంగ్రెస్(టీఎంసీ)​ జోరు కొనసాగుతోంది. భవానీపుర్​ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తన సమీప భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్​పై 31,645 ఓట్ల ముందంజలో ఉన్నారు.  

మరోవైపు.. సంసేర్​గంజ్​, జంగీపుర్​లోనూ టీఎంసీ పార్టీ ముందంజలో ఉంది. జంగీపుర్​లో టీఎంసీ అభ్యర్థి జాకీర్ హుస్సేన్​ తన సమీప భాజపా అభ్యర్థి సజిత్​దాస్​పై 20,745 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  

11:23 October 03

20 వేలు దాటిన ఆధిక్యం

భవానీపుర్ ఉప ఎన్నికల్లో టీఎంసీ అధినేత్రి, ఆ పార్టీ అభ్యర్థి మమతా బెనర్జీ దూసుకుపోతున్నారు. ప్రత్యర్థికి అందనంత ఆధిక్యం సంపాదించారు. ఆరు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి మమతా బెనర్జీ 23,957 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు.

11:16 October 03

భవానీపుర్​ ఉపఎన్నిక ఫలితాల్లో  టీఎంసీ అభ్యర్థి మమతా బెనర్జీ హైస్పీడ్​లో దూసుకుపోతున్నారు. భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్​పై 12,435 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారని ఎలక్షన్ కమిషన్​ తెలిపింది. 

10:58 October 03

  • West Bengal: TMC supporters celebrate outside CM Mamata Banerjee’s residence in Kolkata as she leads in the Bhabanipur Assembly by-election pic.twitter.com/roWsaX9moK

    — ANI (@ANI) October 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

టీఎంసీ సంబరాలు..

భవానీపుర్​ ఉపఎన్నిక ఫలితాల్లో మమతా బెనర్జీ ఆధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో టీఎంసీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కోల్​కతాలోని మమత నివాసం బయట టీఎంసీ మద్దతుదారులు ఒకరిపై మరొకరు రంగులు చల్లుకున్నారు. 

10:37 October 03

భవానీపుర్​ ఉపఎన్నిక ఫలితాల్లో టీఎంసీ అభ్యర్థి మమతా బెనర్జీ హవా కొనసాగుతోంది. మూడో రౌండ్ కౌంటింగ్​ ముగిసేసరికి.. భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్​పై 3,861 ఓట్ల ఆధిక్యంలో మమత ఉన్నారని ఎలక్షన్ కమిషన్ తెలిపింది.  సంసేర్​గంజ్​, జంగీపుర్​లోనూ టీఎంసీ అభ్యర్థులే దూసుకుపోతున్నారు.

10:19 October 03

భవానీపుర్ ఉప ఎన్నిక ఫలితాల్లో టీఎంసీ అభ్యర్థి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దూసుకుపోతున్నారు. తొలి రౌండ్ కౌంటింగ్​​ ముగిసిన తర్వాత..  మమత 3,680 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్​ 881 ఓట్లతో కొనసాగుతున్నారు.

09:44 October 03

దీదీ లీడింగ్..

భవానీపుర్ ఉపఎన్నికలో టీఎంసీ అభ్యర్థి, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధిక్యంలో ఉన్నారు. భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్​పై దాదాపు 2,800 మెజార్టీతో దీదీ దూసుకుపోతున్నారు. జంగీపుర్లోనూ టీఎంసీ అభ్యర్థి 1,300 మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

09:37 October 03

  • Odisha | Counting of votes begins for by-elections in Pipli Assembly constituency; visuals from counting centre in Puri city

    "In Pipli, we've deployed 5 platoons of forces along with an additional SP & 2 DSPs," says Dr Kanwar Vishal Singh, SP, Puri pic.twitter.com/MZ2DTtxRYB

మరోవైపు.. ఒడిశా పూరీలోని పిపిలీ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. "పిపిలీలో భద్రత కోసం అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు సహా  5 యూనిట్ల బలగాలు మోహరించాయని' పూరీ ఎస్పీ డాక్టర్​ కన్వర్ విశాల్ సింగ్​ తెలిపారు.  

09:07 October 03

  • West Bengal: Counting of votes begins for by-elections in Bhabanipur Assembly constituency; outside visuals from Sakhawat Memorial Govt Girls' High School counting centre pic.twitter.com/5so3lzD9pH

భవానీపుర్​ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతున్న సఖావత్​ మెమోరియల్​ ప్రభుత్వ పాఠశాల బయట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 

07:49 October 03

Bhabanipur bypoll: భవానీపుర్​లో మమత విజయం- ప్రజలకు కృతజ్ఞతలు

దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బంగాల్ భవానీపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఫలితం ఇవాళ వెలువడనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రక్రియ ప్రారంభమైంది. 21 రౌండ్లలో ఈ కౌంటింగ్​ జరగనుంది. భవానీపుర్​తో పాటు బంగాల్​లోని సంసేర్​గంజ్​, జంగీపుర్​ ఉపఎన్నిక ఫలితాలు కూడా వెలువడనున్నాయి.  

భద్రత కట్టుదిట్టం

కౌంటింగ్​ నేపథ్యంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చూసేందుకు 24 కంపెనీల కేంద్ర బలగాలు కౌంటింగ్​ కేంద్రాల వద్ద మోహరించాయి. కౌంటింగ్​ పరిసరాల్లో సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశారు. పెన్ను, పేపర్​తో మాత్రమే పట్టుకుని కౌంటింగ్ కేంద్రాల్లోకి అధికారులు వెళ్లేందకు అనుమతి ఇచ్చారు.  

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి ఓటమి చవిచూసిన మమతా బెనర్జీ.. ఈ ఉపఎన్నికలో భవానీపుర్‌ నుంచి పోటీ చేశారు. దీదీకి పోటీగా భాజపా నుంచి న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. దీంతో ఈ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం ఏర్పడింది.

Last Updated : Oct 3, 2021, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.