ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం ఎలా ఉందో తెలుసా? - రాశులవారీగా వారఫలాలు

Weekly Horoscope : అక్టోబర్​ 30 నుంచి నవంబరు 5 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

weekly horoscope
వారఫలాలు
author img

By

Published : Oct 30, 2022, 6:29 AM IST

Weekly Horoscope : అక్టోబర్​ 30 నుంచి నవంబరు 5 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

.

విఘ్నాలు పెరగకుండా చూసుకోవాలి. మనోబలం అవసరం. చంచలత్వం లేకుండా పనుల్ని పూర్తి చేయాలి. ఆవేశం పనికిరాదు. శాంతం ఫలితాన్నిస్తుంది. మేలుచేసేవారున్నారు. ఇంట్లోవారి సలహాలు పనిచేస్తాయి. తొందర నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపారంలో నష్టం సూచితం. ఖర్చులు పెరుగుతాయి. నవగ్రహశ్లోకాలు చదివితే మంచిది.

.

కార్యసిద్ధి విశేషంగా ఉంది. వ్యాపారం కలిసివస్తుంది. అదృష్టవంతులవుతారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కాలం సహకరిస్తోంది, అనుకున్నది సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండాలి. ఇష్ట దేవతను ధ్యానించండి, శుభయోగాలున్నాయి.

.

మనోబలం ముందుకు నడిపిస్తుంది. అదృష్టయోగం ఉంది. స్పష్టత అవసరం. దేనికీ సందేహం పనికిరాదు. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలుంటాయి. తోటివారి సహకారం ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్త. స్వయంగా పర్యవేక్షిస్తే లాభం ఉంటుంది. తొందర వద్దు. ప్రతిభతో అభివృద్ధిని సాధిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి, ఆశయం నెరవేరుతుంది.

.

అద్భుతమైన విజయం ఉంది. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. సకాలంలో పనులు పూర్తిచేస్తే కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. గ్రహబలం బాగుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు లక్ష్యాన్ని చేరుస్తాయి. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థికవృద్ధి బాగుంటుంది. భూ, గృహ, వాహనాది సౌఖ్యాలుంటాయి. సూర్యాష్టకం చదివితే మేలు.

.

ఉద్యోగంలో అధికారయోగం సూచితం. ఆత్మవిశ్వాసంతో మంచి భవిష్యత్తును సాధించగలరు. స్వల్ప విఘ్నాలున్నా ఫలితం అనుకూలం. స్వయంగా పనులు చేసుకోండి. ధర్మబద్ధంగా ముందడుగు వేయండి. ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. ఇంట్లోవారితో ఆనందాన్ని పంచుకుంటారు. దుర్గాదేవి ధ్యానం శుభప్రదం.

.

అదృష్టకాలం నడుస్తోంది. ఉత్సాహంగా పని మొదలుపెట్టండి. సద్భావనతో ఉంటే అంతా శుభమే జరుగుతుంది. ధర్మదేవతానుగ్రహంతో పోయినవి తిరిగి వస్తాయి. అధికారుల ప్రశంసలుంటాయి. ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారయోగం బ్రహ్మాండం. స్పష్టంగా నిర్ణయం తీసుకోండి. ఇష్టదైవాన్ని ధ్యానించండి, శుభం జరుగుతుంది.

.

ముఖ్యకార్యాలను శ్రద్ధగా చేయాలి. పొరపాటువల్ల నష్టం ఎక్కువవుతుంది. ఇబ్బందులు తాత్కాలికమే. శుభయోగం ఉంది. అవసరాలకు ధనం అందుతుంది. అపోహలకు తావివ్వవద్దు. సర్దుకుపోవటం మంచిది. ప్రతిదీ మనసుకు తీసుకోవద్దు. వారం మధ్యలో ఉపశమనం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. నవగ్రహశ్లోకాలు చదవండి, శాంతి లభిస్తుంది.

.

కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో మంచి ఫలితం సాధిస్తారు. వ్యాపారం కలిసివస్తుంది. ధర్మబద్ధంగా నిర్ణయాలు
తీసుకోవాలి. పరిస్థితులకు తగినట్లుగా వ్యవహరించాలి. సౌమ్యసంభాషణతో శాంతి లభిస్తుంది. కలిసికట్టుగా ఉంటే విఘ్నాలు తొలగుతాయి. ఆవేశపరిచే పరిస్థితులకు దూరంగా ఉండాలి. ఆంజనేయస్వామిని ధ్యానించండి, మేలు జరుగుతుంది.

.

ఉద్యోగంలో అధికారుల ప్రశంసలుంటాయి. మనసు స్థిరంగా ఉండాలి. వ్యాపారబలం అద్భుతం. కాలం కలిసి వస్తుంది. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. సంపదలు వృద్ధి చెందుతాయి. ఇష్టదేవతను దర్శించండి, శుభవార్త వింటారు.

.

కాలానుగుణంగా ముందుకు సాగండి. ప్రతి చర్యా అభివృద్ధి దిశగానే ఉండాలి.శాంతచిత్తంతో ఆలోచించాలి. గౌరవం పెరుగుతుంది. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. వ్యాపారంలో మెలకువలు అవసరం. ఆర్థికంగా ఇబ్బందులున్నా సరైన నిర్ణయంతో సమస్య తొలగుతుంది. లక్ష్మీదేవిని స్మరించండి, సానుకూల ఫలితాలు వస్తాయి.

.

అదృష్టయోగం కొనసాగుతోంది. సకాలంలో పనిచేస్తే సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. దేనికీ తొందరవద్దు. ధనధాన్య లాభముంది. పొదుపు అవసరం. బంధుమిత్రుల అభినందనలుంటాయి. వ్యాపారం మిశ్రమం. ఎదురుచూస్తున్న పని ఒకటి దిగ్విజయంగా పూర్తవుతుంది. కుటుంబపరంగా ఆనందించే అంశం ఉంది. ఆదిత్యహృదయం చదవండి, ఉత్సాహం పెరుగుతుంది.

.

మంచి పనులు చేసి విజయం సాధించండి. మనోబలం సంపూర్ణంగా ఉంటుంది. సందేహిస్తే విఘ్నం పెరుగుతుంది. చంచలత్వం వద్దు. మొహమాటం వల్ల సమస్య పెద్దది కాకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి ఉంటుంది. శాంతంగా వ్యవహరించండి. ఇంట్లోవారి సూచనలు అవసరం. సూర్య నారాయణమూర్తిని స్మరిస్తే మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.