Congress protest on inflation: ధరల పెరుగుదల, నిరుద్యోగం, జీఎస్టీ రేట్ల పెంపు అంశాలపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. దిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సహా అనేక మంది నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ సహా అదుపులోకి తీసుకున్న ఇతర ఎంపీలను పోలీస్ లైన్స్‌లోని కింగ్స్‌వే క్యాంపునకు తరలింంచారు. ప్రజా సమస్యలను లేవనెత్తడమే తమ కర్తవ్యమని.. ఈ విధులు నిర్వర్తించినందుకు తమ ఎంపీలను అదుపులోకి తీసుకుంటాన్నరని రాహుల్ ఆరోపించారు.
అంతకుముందు.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా పలువురు ఎంపీలు పార్లమెంట్లో నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. పాదయాత్రగా రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఎంపీలను.. విజయ్ చౌక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాహుల్ గాంధీ సహ కాంగ్రెస్ కార్యకర్తలు వర్షంలోనూ నిరసనలను కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు.. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ నేతలతో కలిసి ఆందోళనల్లో పాల్గొన్న ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీగా అక్కడికి చేరుకున్న మహిళా పోలీసులు బలవంతంగా ప్రియాంకను వాహనంలోకి ఎక్కించారు.
ఇవీ చదవండి: 'దేశంలో ఆ ఇద్దరి 'నియంత' పాలన.. ప్రశ్నిస్తే దాడులే!'
ఆడపిల్ల పుట్టిందని అమానుషం.. సజీవంగా పొలంలో ఖననం.. రక్షించిన రైతు