ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం (Modi Birthday Celebration) సందర్భంగా వివిధ ప్రాంతాల్లో భాజపా కార్యకర్తలు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మోదీ 71వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కార్యకర్తలు.. 71 అడుగుల కేక్‌ను తయారు చేయించారు. వ్యాక్సిన్ రూపంలో ఉన్న ఈ భారీ కేక్‌ను ప్రధాని మోదీకి అంకితం ఇస్తూ టీకా పంపిణీ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
"ఈ రోజు ప్రజాసేవకు ప్రత్యేకమైనదిగా భావిస్తున్నాము. మోదీ పుట్టినరోజు సందర్భంగా మొత్తం 71 మంది రక్తదానం చేశారు. 71 అడుగుల కేక్‌ను కూడా కట్ చేశాము. ప్రధాని.. ఇలాగే ప్రజాసేవ కొనసాగించాలని ఆశిస్తున్నాము."
-భాజపా కార్యకర్త
ఇందోర్‌లో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గీయ.. దివ్యాంగ చిన్నారుల మధ్య వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో కలిసి పాటలు పాడారు.
71 కేజీల లడ్డూ..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రధాని సొంత నియోజకవర్గమైన వారణాసిలో దీపాలు వెలిగించి.. మోదీ పుట్టినరోజు వేడుకలను (Modi Birthday News) నిర్వహించారు కార్యకర్తలు. ఈ సందర్భంగా 71 కిలోల లడ్డూను కోసి సంబరాలు (Modi Birthday Celebration) చేసుకున్నారు. భాజపా ఎంపీ రూపా గంగూలీ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ జీసీ త్రిపాఠి ఆధ్వర్యంలో 'కాశీ సంకల్ప్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
సైకత శిల్పం..
ప్రధాని మోదీకి అంకితం చేస్తూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్.. పూరీ బీచ్‌లో సైకత శిల్పాన్ని రూపొందించారు.
ధాన్యాలతో చిత్రపటం..
ఒడిశాకు చెందిన ప్రియాంక సహానీ అనే యువతి ఆహార ధాన్యాలతో 8 అడుగుల పొడవు ఉన్న ప్రధాని మోదీ ఆకృతిని రూపొందించింది. మోదీ 71వ పుట్టినరోజు సందర్భంగా దీనిని ఆయనకు అంకితం చేస్తున్నట్లు పేర్కొంది. భారత్.. వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చే దేశం కావడం వల్ల ఈ చిత్రాన్ని ధాన్యాలతో తయారు చేసినట్లు ప్రియాంక వెల్లడించింది. ఇది ఒడిశా సంప్రదాయ కళ అయిన పట్టచిత్రను ప్రతిబింబిస్తుందని తెలిపింది.
వ్యాక్సినేషన్ రికార్డ్ లక్ష్యంగా..
నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా (Modi Birthday News) దేశవ్యాప్తంగా 1.5 కోట్లకు పైగా టీకాలను పంపిణీ (Vaccination in India) చేయాలని భాజపా లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదీ చూడండి : Mizoram covid: 'వారిలో లక్షణాలు లేకుంటే ఆందోళన అక్కర్లేదు'