ETV Bharat / bharat

ఒక్కసారిగా పేలిన వాషింగ్​ మెషీన్​.​. ఒకరు 'అరెస్ట్'​.. ఏం జరిగింది?

Washing Machine Blast: అప్పటివరకు సరిగ్గా ఉన్న వాషింగ్​ మెషీన్​ అకస్మాత్తుగా మొరాయించింది. ఏం చేయాలో తెలియక ఆ వ్యక్తి.. మెకానిక్​ను పిలిపించాడు. అతడు పరిశీలించి రిపేరు చేయడం మొదలు పెట్టగానే.. భారీ శబ్దంతో వాషింగ్​ మెషీన్​ పేలింది. దీంతో ఒక్కసారిగా అంతా పరుగులు తీశారు. అసలేం జరిగింది?

Washing machine blast
Washing machine blast
author img

By

Published : Jun 13, 2022, 2:14 PM IST

Washing Machine Blast: మహారాష్ట్రలోని పుణెలో ఆదివారం సాయంత్రం ఓ అపార్ట్​మెంట్​లో వాషింగ్​ మెషీన్​ పేలిపోయింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడం వల్ల చుట్టుపక్క ఇళ్లల్లో ఉన్నవారు భయపడిపోయి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?

పుణెలోని భవానీపేట్ ప్రాంతంలో బి-వింగ్​ అపార్ట్​మెంట్​లో ఓ వ్యక్తి తన కుటుంబంతో గత పదేళ్లుగా నివసిస్తున్నాడు. వీకెండ్​ అని చెప్పి బట్టలు.. వాషింగ్​ మెషీన్​లో వేద్దామనుకుని సిద్ధమయ్యాడు. కానీ వాషింగ్​ మెషీన్​ ఆన్​ కాలేదు. దీంతో వెంటనే తెలిసిన ఓ మెకానిక్​ను పిలిపించాడు. అతడు వచ్చి పరిశీలించాడు. ఏదో సమస్య ఉందని చెప్పి రిపేరు చేయడం ప్రారంభించాడు మెకానిక్​. దీంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. వెంటనే ఇంట్లో వాళ్లు, మెకానిక్​ హడలెత్తిపోయి పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పుణె పోలీసులు.. బాంబ్​ స్క్వాడ్​ను రంగంలోకి దింపారు. పేలుడు సంభవించిన అపార్ట్​మెంట్​ను క్షుణ్నంగా పరిశీలించారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, దర్యాప్తు చేపడతున్నామని పోలీసులు తెలిపారు. అపార్ట్​మెంట్​లోని ఓ వ్యక్తిని విచారణ కోసం పోలీసులు ​స్టేషన్​కు తీసుకెళ్లారు.

ఇవీ జరిగింది: ప్రియుడి కోసం భర్త హత్యకు భార్య సుపారీ.. వారి​ పేరు చెప్పి డ్రామా.. చివరకు..

ఈడీ కార్యాలయానికి చేరుకున్న రాహుల్.. నేతలు, కార్యకర్తలతో భారీ ర్యాలీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.