ETV Bharat / bharat

ఓటర్లతోనే నేతల తలరాత - ఓట్లకు అభ్యర్థుల గాలం - తెలంగాణలో ఎన్నికల సంగ్రామం

Voters Festival in Telangana : తెలంగాణలో హ్యాట్రిక్‌ కొట్టాలని అధికార బీఆర్​ఎస్​, బోణీ కొట్టాలని విపక్ష కాంగ్రెస్‌.. దక్షిణాదిన కర్ణాటక తర్వాత మరో రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నాయి . అత్యధిక స్థానాల్లో గెలిచి సత్తా చాటాలని వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తుకు పైఎత్తులతో ప్రధాన పార్టీలు అసెంబ్లీ సమరంలో పోరాడుతున్నాయి. అభ్యర్థులు సైతం ప్రతీ ఓటును కీలకంగా భావించి.. ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు . హామీలు గుప్పిస్తూ.. గడపగడపకు తిరుగుతూ.. తమను గెలిపిస్తే చేసే పనులను ఓటర్లకు వివరిస్తున్నారు. అనుచరగణంతో నే కాకుండా కుటుబసమేతంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

Political Parties Election Campaign
Voters Festival in Telangana
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 6:00 AM IST

ఓటర్లతోనే నేతల తలరాత- ఓట్లకు అభ్యర్థుల గాలం

Voters Festival in Telangana : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం ప్రధాన పార్టీలైన బీఆర్​ఎస్(BRS)​, కాంగ్రెస్‌, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఓటర్ల మెప్పు పొందేందుకు అభ్యర్థులు తమకు వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఓ వైపు నామినేషన్లు జోరుగా సాగుతుండగానే.. ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో భారీ సభలతోపాటు గ్రామాల్లో గడపగపడకు తిరుగుతూ ఓటర్ల మద్దతు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

'ప్రలోభాలకు లొంగం, భవిష్యత్​ను ఆగం చేసుకోం'

Telangana Assembly Elections 2023 : సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు పలు దఫాలు కాలికి బలపం కట్టుకుని పల్లెలను ఇప్పటికే చుట్టేశారు. కాంగ్రెస్‌(Congress), బీజేపీ అభ్యర్థులు సైతం ప్రచారాన్ని పదునెక్కించే వ్యూహాలతో ముందుకెళుతున్నారు. తమ అనుచరులను, బంధువులను, పార్టీ నేతలతో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి ఆశీర్వదించాలంటూ కోరుతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతోపాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం కొనసాగిస్తూనే ఇంటింటి ప్రచారానికి బంధువులు, కుటుంబసభ్యులను పంపిస్తున్నారు. ఆత్మీయంగా పలకరిస్తూ..ఈసారి ఓటు తమవారికే వేయాలంటూ ప్రాధేయపడుతున్నారు.

మీ సమస్యలకు పరిష్కారం చూపుతామని భరోసా ఇస్తూ ఓటర్ల ఇళ్లను చుట్టేస్తున్నారు. అన్ని పార్టీల నేతల రాకతో గ్రామాల్లో సందడి నెలకొంటోంది. ఓటర్లు ఎవ్వరూ వచ్చినా.. కాదనకుండా అందరి ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఓటరు నాడి అర్థం కాక ప్రధాన పార్టీల అభ్యర్థులు గుబులు చెందుతున్నారు. పోటాపోటీగా మరింత జోరుగా జనంలోకి వెళుతున్నారు. కులసంఘాలు, వృత్తి, యువజన సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ.. మద్దతు కూడగట్టే యత్నం చేస్తున్నారు. దూరప్రాంతాల్లో ఉన్న వారిని ఫోన్‌లో పలకరిస్తూ.. పోలింగ్‌ సమయానికి ఓటేసేందుకు రావాలంటూ కోరుతున్నారు .

Political Parties Election Campaign : అవసరమైతే ప్రయాణఖర్చులు భరిస్తామంటూ భరోసా ఇస్తున్నారు . ఒక్క ఓటుతో కూడా ఒక్కోసారి ఫలితం తారుమారయ్యే పరిస్థితులు ఉంటాయనే భావనతో ప్రతీ ఓటరుని వ్యక్తిగతంగా కలుస్తున్నారు. పార్టీల ప్రచారం ముమ్మరవుతున్న వేళ ఆయా పార్టీల అభ్యర్థులు ఖర్చుకు వెనకాడటం లేదు. సభలు, సమావేశాలు, రోడ్‌షోలతోపాటు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అనుచరగణానికి భోజన, వసతి సౌకర్యాలతోపాటు వాహన సదుపాయాలు కల్పించడం, పెట్రోల్‌, డీజిల్‌తోపాటు ఇతర ఖర్చులు భరిస్తున్నారు.

మద్యంతోపాటు ఇతర పనులకు భారీగా ఖర్చు పెడుతు‌న్నారు. పార్టీ కార్యకర్తలతో పాటు అనుచరులు చెప్పినవిధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు . ప్రతీ అభ్యర్థి సగటున 500 నుంచి వెయ్యి మందికి భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా వంట మాస్టార్లను నియమించుకుని రుచికర వంటలు చేయిస్తున్నారు. వారంలో కనీసం మూడురోజులు మాంసాహారం ఉండేలా చూసుకుంటున్నారు . రోజంతా ప్రచారంలో పాల్గొన్నవారికి సాయంత్రం కాగానే.. బీరు, బిర్యానీ అందించడం తప్పనిసరి. తమ అనుచరులను, బంధువులు, కుటుంబసభ్యులు మోహరించి ఓటర్లను రోజూ కలిసేలా ప్రచార ప్రణాళిక సిద్ధం చేస్తు‌న్నారు.

ప్రతీ అభ్యర్థి సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. వాట్సప్‌ గ్రూపుల్లో రోజూ పోస్టులు పెడుతూ ఓటర్లు దగ్గరకు అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు ఓ అడుగు ముందుకేసి.. మీమర్స్‌ను నియమించుకుని.. ప్రత్యర్థుల లోపాలు ఎత్తిచూపేలా వీడియోలు చేయించి.. సామాజిక మాధ్యమాల్లో పెడుతూ వైరి వర్గాలపై పైచేయి సాధించేందుకు యత్నిస్తున్నారు. తమకు కలిసొచ్చే ఏ అంశాన్ని వదలకుండా ప్రచారాస్త్రాలుగా వాడుకుంటున్నారు.

Migrant Voters In Telangana : వలస ఓటర్లపై నేతల కన్ను.. వారి వివరాల సేకరణ కోసం ప్రత్యేక బృందాలు

Telangana Election Campaign in WhatsApp : వాట్సాప్‌ గ్రూపుల్లో ఎన్నికల ప్రచారం.. స్పేస్‌ అంతా లాగేస్తోందని వాపోతున్న యూజర్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.